బ్యాంకుల్లో లోన్ కావాలంటే ఇన్‌కంటాక్స్ రిటర్న్ చూపించడం ఎలా అవసరమో... కొత్త కంపెనీల్లో శాలరీ పెంచమని అడిగేందుకు ఈ శాలరీ స్లిప్ అనేది ఉద్యోగికి అలా అవసరం. కొత్త కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తే... అందులో శాలరీ డీటెయిల్స్ ఇస్తారు. అందులో టేక్ హోమ్ శాలరీ (అంటే చేతికి వచ్చేది) చూపిస్తారు. అలాగే... కటింగ్స్ ఏవేవి ఉంటాయో కూడా వివరిస్తారు. (Symbolic image)
Leave Travel Allowance (LTA): ఇది పూర్తిగా టాక్స్ మినహాయింపు వచ్చేది. మీరు మీ భాగస్వామితో, పిల్లలు, తల్లిదండ్రులతో ట్రావెల్ చెయ్యవచ్చు. ఈ ఆప్షన్ కింద ఉద్యోగులు... సంవత్సరానికి 6 హాలిడే ట్రిప్స్ వేయవచ్చు. ఐతే... ఆ ఖర్చుల బిల్లుల్ని ఆఫీసులో ఇచ్చి... డబ్బు తీసుకోవడం అనేది ఒకింత సమస్యలతో ఉంటుంది. (Symbolic image)
Target Variable (TVP): దీన్ని నెలవారీ లేదా మూడు నెలలకోసారి లేదా సంవత్సరానికి ఓసారి చెల్లిస్తారు. ఉద్యోగి పెర్ఫార్మెన్సును బట్టీ దీన్ని చెల్లిస్తారు. సంవత్సరానికి లెక్క వేస్తే... ప్రతి నెలా ఉద్యోగి శాలరీ నుంచి ఈ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. ఏడాది తర్వాత పెర్ఫార్మెన్సును బట్టీ... మొత్తం వెనక్కి ఇవ్వాలా లేక... ఎంతవరకూ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. (Symbolic image)
Medical Allowance: వైద్య బత్యం అనేది ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు అయ్యే వైద్య ఖర్చులకు సంబంధించినది. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల అంశాల కింద ఉద్యోగి శాలరీ నుంచి కొంత డబ్బును ఇన్సూరెన్సులకు కేటాయిస్తున్నారు. ఈ వైద్య బత్యం కూడా ఇన్సూరెన్స్ ద్వారానే రాబట్టే ఛాన్స్ ఉంటుంది. (Symbolic image)
Provident Fund: కంపెనీలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే... 1952 EPF చట్టం ప్రకారం... బేసిక్ శాలరీ నుంచి 12 శాతంను PFకి మళ్లించాలి. అటు కంపెనీ కూడా... అంతే మొత్తాన్ని ఉద్యోగి PF అకౌంట్‌కి చెల్లించాలి. కొన్ని కంపెనీలు... తాము మళ్ళించాల్సిన డబ్బును కూడా ఉద్యోగి శాలరీ నుంచే వసూలు చేసి మళ్లిస్తున్నాయి. (Symbolic image)