డ్రైవ్ కు వెళ్లేటప్పుడు మీ వాహనం గురించి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. మీ వాహనం ఫిట్నెస్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మీ వాహనంలో ఇంధనం ఏ మేరకు ఉందో తెలుసుకోవాలి. మీ కారు గేర్ అడ్జస్ట్ మెంట్ సిస్టం గురించి తెలిసి ఉండాలి. క్లచ్, బ్రేక్ వేసే విషయంలో అలర్ట్ గా ఉండాలి. హైస్పీడ్ లో వెళ్తున్నప్పుడు గేర్ దించడం, రివర్స్ గేర్ వేయడం ప్రమాదకరం.