ఇండియాలో ఎక్కువగా సినీ, క్రీడా సెలబ్రిటీలను ఫాలో అవుతారు. సెలబ్రిటీల జీవితాలు, అభిరుచుల పట్ల ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. సెలబ్రిటీలు వాడుతున్న కార్లు, క్యాస్టూమ్స్, నివాసం తదితర విషయాలు తెలుసుకోవడంలో ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. (image credit - instagram - ashwitha4real)
సెలబ్రిటీలు సాధారణంగా లగ్జరీ కార్లు వాడుతుంటారు. లగ్జరీ కార్లను స్టెటస్ సింబల్‌గా భావిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ ప్రారంభంలో వాడిన మొదటి కార్లను(Celebs First Cars) ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాటి పట్ల ఎంతో శ్రద్ద తీసుకుంటారు. వాటిని అపురూపమైనవి గా భావిస్తారు. భారత్‌లోని సెలబ్రిటీలు వాడిన మొదటి కార్లపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
సల్మాన్‌ఖాన్ - ట్రయంఫ్ హెరాల్డ్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ వద్ద ప్రస్తుతం విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే అతని మొదటి రైడ్ సెకండ్ హ్యాండ్ ట్రయంఫ్ హెరాల్డ్. ఈ కారును మొదట రిషి కపూర్ ఒక సినిమాలో ఉపయోగించారు. ఆ తరువాత దాన్ని సలీం ఖాన్ (సల్మాన్ తండ్రి)కి అందించారు. దీంతో సల్మాన్ ఖాన్ ఆ కారును మొదటగా వాడేవారు.(ప్రతీకాత్మక చిత్రం)
షారూఖ్ ఖాన్ - మారుతి ఓమ్ని : బాద్షా, కింగ్‌ఖాన్‌గా ప్రసిద్ధి చెందిన షారూఖ్ ఖాన్, బాలీవుడ్ బడా హీరో. ఈ బాద్షాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. హీరోగా కెరీర్ ప్రారంభంలో కింగ్‌ఖాన్ మొదటి కారు మారుతి ఓమ్ని. ఈ కారును తన తల్లి బహుమతిగా ఇచ్చింది. ఈ కారంటే షారుఖ్ ఖాన్‌ను ఎంతో ఇష్టం. అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు.(Photo credit : @IamSRKSquad)
సచిన్ టెండూల్కర్ - మారుతి 800 : క్రికెట్ దేవుడుగా ప్రసిద్ధి చెందిన సచిన్, క్రీడల్లో అరుదైన ఆటగాడు. మాస్టర్ బ్లాస్టర్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్ వద్ద 360 మోడెనా ఫెరారీ అనే లగ్జరీ కారు ఉంది. దీన్ని F1 లెజెండ్ మైఖేల్ షూమేకర్ సచిన్‌కు బహుమతిగా ఇచ్చారు. అయితే సచిన్ తన కెరీర్ ప్రారంభంలో మొదటి కారుగా మారుతి 800ను నడిపేవాడు.(ఫైల్ ఫొటో)