నేటి జీవనశైలిలో తక్కువ శారీరక శ్రమ, క్రమరహిత ఆహారం కారణంగా, గుండె జబ్బుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దేశంలో అత్యధిక మరణాలకు గుండె జబ్బులే కారణమనే విషయం చాలామందికి తెలియదు. ఇందులో కూడా 85% మరణాలు గుండెపోటు, పక్షవాతం కారణంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2021లో ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్స్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జనాభాలో 75% మంది గుండె ఆగిపోవడం, గుండె సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. అయితే 80 శాతం గుండె జబ్బులు, స్ట్రోక్లను నివారించవచ్చు. ఇందులో ఒత్తిడిని తగ్గించుకోవడం, రెగ్యులర్ రొటీన్ చేయడం చాలా ముఖ్యం. ఇది కాకుండా శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం )
దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసుల సంఖ్య పెరుగుతుండడంతో గందరగోళం కూడా పెరుగుతోంది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తిలక్ సువర్ణ... గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని అపోహలపై చిట్కాలు ఇచ్చారు. 5 గుండె జబ్బులకు సంబంధించిన సాధారణ అపోహ, వాటి వాస్తవికత గురించి తెలుసుకోండి.(ప్రతీకాత్మక చిత్రం )
గుండె జబ్బులు బరువు కంటే జీవనశైలికి సంబంధించినవి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో అధిక బరువు ఉన్నవారిలో 50 శాతం మంది చురుకుగా ఉన్నందున సాధారణ కొలెస్ట్రాల్, రక్తపోటు ఉన్నట్లు కనుగొనబడింది, అయితే సాధారణ బరువు ఉన్న క్రియారహిత వ్యక్తులలో నాలుగింట ఒక వంతు మంది అధిక కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు కలిగి ఉన్నారు. జీవనశైలి చురుగ్గా లేకపోతే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం )
మన జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చికిత్సలు జరుగుతుంటాయి. కానీ మందులతో జీవనశైలిలో మార్పులు చేసుకుంటే.. సర్జరీ కంటే మేలు జరుగుతుందని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో తేలింది. స్టంట్స్, బైపాస్ సర్జరీలు గుండెపోటును నివారిస్తాయని గ్యారెంటీ లేదు.(ప్రతీకాత్మక చిత్రం )
గుండెపోటు కేవలం పురుషులకు మాత్రమే వస్తుందని ఒక సాధారణ నమ్మకం. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. 50 ఏళ్ల తర్వాత దీని ప్రమాదం పురుషులు, మహిళలు ఇద్దరిలో సమానంగా ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం... ఈ వయసులో మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెన్ హార్మోన్ దీనికి కారణం. ఇది మహిళల గుండెకు రక్షణను అందిస్తుంది. అయితే మెనోపాజ్ సమయంలో దాని పరిమాణం తగ్గుతుంది.(ప్రతీకాత్మక చిత్రం )
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉంటే... గుండెపోటు ప్రమాదం నివారించబడుతుంది, ఇది కాకుండా గుండెపోటుకు అనేక అంశాలు కారణమవుతాయని సాధారణంగా నమ్ముతారు. జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. గుండె సమస్యలతో బాధపడుతున్న వారిలో 50 శాతం మంది కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నవారే. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ కాకుండా అనేక అంశాలు ఉన్నాయి. అయితే కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు సంబంధించిన మొదటి, అతి ముఖ్యమైన సంకేతం.(ప్రతీకాత్మక చిత్రం )
తల్లిదండ్రులలో ఒకరికి గుండె జబ్బు ఉంటే పిల్లలలో ఈ సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, అయితే ఇది ఎల్లప్పుడూ జరగాల్సిన అవసరం లేదు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. తల్లిదండ్రులలో ఒకరికి గుండె జబ్బులు ఉంటే.. అప్పుడు పిల్లలకు కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లలకు గుండె జబ్బులు వస్తాయని దీని అర్థం కాదు. ఉదాహరణకు, జన్యుపరంగా అధిక కొలెస్ట్రాల్.. దీనిని కుటుంబ కొలెస్ట్రాలేమియా అంటారు. దీని ప్రమాదం 200 మందిలో ఒకరికి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం )