Makhana : డ్రై ఫ్రూట్స్‌గా పిలిచే మఖానాను ఓ రకమైన వాటర్ లిల్లీ ఆకుల నుంచి సేకరిస్తారు. ఈ గింజల్ని రోస్ట్ చేసినప్పుడు పేలాల లాగా ఉబ్బుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మఖానాను దేశీ నెయ్యిలో వేయించుకుంటే వాటి రుచి మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి. (Image credit - Canva)
Peanuts : పగటిపూట మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఉడికించిన వేరుశెనగలను తినండి. లేగా పచ్చివి తినవచ్చు. లేదా కాల్చినవి కూడా తినవచ్చు. చలికాలంలో ఉడకబెట్టిన వేరుశెనగను బెల్లంతో కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి గుండెకు హాని చెయ్యవు. కొలెస్ట్రాల్ ఏర్పడదు. ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. రోజూ గుప్పెడు వేరుశనగల్ని తినవచ్చు. అంతకంటే ఎక్కువ తింటే మాత్రం బరువు పెరుగుతారు. (Image credit - Canva)
Chick-pea : దోరగా వేయించిన శనగలు తింటే.. మీకు ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఇవో మంచి స్నాక్స్. ఇవి రుచికరంగా ఉంటాయి. మరమరాలు, ఉల్లిముక్కలు, టమాట ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, కారం, శనగలు కలుపుకొని తింటే.. దాన్ని మించిన టేస్ట్ ఏ స్నాక్స్‌కి ఉంటుంది చెప్పండి. ఆరోగ్యకరమైన ఈ స్నాక్స్‌ని రెగ్యులర్‌గా తినడం వల్ల.. జంక్ ఫుడ్ దూరం చేసుకోవచ్చు. (Image credit - Canva)
Fruit Chat : మీరు జంక్ ఫుడ్‌ను దూరం చేసి, పగటిపూట ఏదైనా తినాలనే కోరిక కలిగి ఉంటే.. సీజనల్ ఫ్రూట్స్ గొప్ప ఎంపిక. వాటి సహాయంతో మీరు రుచికరమైన ఫ్రూట్ చాట్ చేసుకొని తినవచ్చు, అది పోషకమైనది, రుచికరమైనది. మీరు రోజువారీ అవసరం అయ్యే ఏ, బీ గ్రూప్, సీ, ఈ, కే విటమిన్లు ఇతర పోషకాలు వాటి ద్వారా లభిస్తాయి. (Image credit - Canva)
Oatmeal : ఓట్స్‌తో తయారుచేసే ఓట్ మీల్ చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోతగ్గ ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. శరీరానికి శక్తిని ఇచ్చే ఓట్ మీల్.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌కు గొప్ప ప్రత్యామ్నాయం. ఓట్ మీల్ అన్ని వయసుల వారూ తినవచ్చు. ఇవి కొవ్వును కరిగించి.. అధిక బరువు తగ్గేలా చేస్తాయి. జీర్ణక్రియను బాగా పెంచుతాయి. (Image credit - Canva)