2. మీకు పెళ్లి అయినా.. ప్రేమలో పడ్డా మీ తోటి వ్యక్తి వ్యక్తిత్వాలు మారిపోవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెళ్లయిన వారు కుటుంబానికి తగ్గట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే ప్రేమలో ఉన్న వారు.. మీరు ఎదుటి వ్యక్తి జీవితంలోకి రాకముందు కూడా అతనికి ఒక జీవితం ఉందని గుర్తించి దాన్ని గౌరవించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఒక్కటి మాత్రం నిజం జీవిత భాగస్వామి, ప్రియుడు, ప్రియురాలిపై మితిమీరిన అంచనాలు ఉండొద్దు. ఇవి ఏ బంధాన్నయినా బలహీనపరుస్తాయి. మీరనుకున్నట్లుగానే భాగస్వామి నడుచుకోవాలనుకోవడం, మీ అంచనాలను ప్రతిసారీ అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. మీ బంధం చక్కగా సాగాలంటే భాగస్వామి నుంచి ఈ విషయాలను ఆశించకండి మరి.