ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ ఏటా "ట్రావెలర్స్ ఛాయిస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హోటల్స్" అవార్డులను అందిస్తుంది. కాగా 2023 టాప్ హోటల్స్ లిస్ట్‌లో ఇండియన్ హోటల్ రాంబాగ్ ప్యాలెస్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. 2022, జనవరి 1 నుంచి 2022, డిసెంబర్ 31 వరకు 15 లక్షలకు పైగా హోటళ్ల నుంచి 12 నెలల ట్రిప్ అడ్వైజర్ (TripAdvisor) రివ్యూ డేటాను విశ్లేషించి, రాంబాగ్ ప్యాలెస్ నంబర్.1 హోటల్‌గా తేల్చారు.
ప్యాలెస్ విశేషాలు : జ్యువెల్ ఆఫ్ జైపూర్‌గా పిలిచే మొదటి రాంబాగ్ ప్యాలెస్‌ను 1835లో నిర్మించారు. మొదట్లో ఇది రాణికి ఇష్టమైన పనిమనిషికి నివాసంగా ఉండేది. కానీ తర్వాత అది రాయల్ గెస్ట్‌హౌజ్, హంటింగ్ లాడ్జ్‌గా రూపాంతరం చెందింది. 1925లో జైపూర్ మహారాజు రాంబాగ్ ప్యాలెస్‌ను తన శాశ్వత నివాసంగా చేసుకున్నారు. రాంబాగ్ ప్యాలెస్ ఒకప్పుడు చక్రవర్తులకు మాత్రమే ఆతిథ్యాన్ని ఇచ్చేది. నేడు సందర్శకులకు లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది.
ఈ ప్యాలెస్ 47 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో అద్భుతమైన తోటలు, విశాలమైన వరండాలు, అందంగా నిర్మించిన గదులు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మహారాజా సవాయి మాన్ సింగ్ ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. నేడు టాటా గ్రూప్‌కి చెందిన తాజ్ హోటల్స్, రిసార్ట్స్ & ప్యాలెసెస్ ఈ హోటల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్‌ను చూసుకుంటుంది.
మిగతా టాప్ హోటల్స్ లిస్ట్ : మాల్దీవుల్లోని ఓజెన్ రిజర్వ్ బోలిఫుషి (Ozen Reserve Bolifushi) ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ హోటళ్లలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్‌లోని ది రిట్జ్-కార్ల్టన్ (The Ritz-Carlton), బ్రెజిల్‌లోని హోటల్ కొలిన్ డి ఫ్రాన్స్ (Hotel Colline de France), లండన్‌లోని షాంగ్రి-లా ది షార్డ్ (Shangri-La The Shard), దుబాయ్‌లోని JW మారియట్ మార్క్విస్ హోటల్ టాప్ 10 హోటల్స్‌లో చోటు సంపాదించాయి.