ఇక క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. నిన్నటికి నిన్న జిల్లాలో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. గొర్రెపల్లి గ్రామ సర్పంచ్ కొంపెల్లి సరోజన కొడుకు విష్ణు(35) క్రికెట్ ఆడుతుండగా గుండె పోటుకు గురయ్యాడు. అతన్ని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. (ప్రతీకాత్మక చిత్రం)
రాజ్‌కోట్‌లో క్రికెట్ ఆడుతున్న ఐదుగురు, ఫుట్‌బాల్ ఆడుతున్న ఒకరు సహా మొత్తం ఏడుగురు మరణించారు. ఈ మధ్య పూర్తి ఆరోగ్యంగా ఉన్న యువత కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. దీంతో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)