Propose Day 2023 : ప్రపోజ్ డేకి గిఫ్ట్ ఎందుకు? మామూలుగా ప్రపోజ్ చేస్తే చాలదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. గిఫ్ట్ ఉండాలి. చిన్నదైనా పర్వాలేదు.. అది ఇచ్చే థ్రిల్ వేరు. ఎందుకంటే.. మీరు ఇచ్చే గిఫ్ట్.. సర్ప్రైజ్ కలిగిస్తుంది. అది మీ పార్ట్నర్కి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వాలెంటైన్స్ వీక్‌లో తమకు గిఫ్ట్స్ పొందడం ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని చాలా మంది తెలిపారు. అందువల్ల ఇవాళ ప్రపోజ్ చేయాలి అనుకునేవారు.. ఓ మంచి గిఫ్ట్‌తో ప్రపోజ్ చేస్తే.. "పడిపోయా.. పడిపోయా.. పడిపోయా.. నీ ప్రేమ లోనే" అనే సాంగ్ అటు నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ప్రేమను వ్యక్తం చేయడం తేలికే.. "ఐలవ్యూ.. మనం పెళ్లి చేసుకుందామా" అని సింపుల్‌గా చెప్పేయవచ్చు. కానీ మీ జీవితంలో ఈ రోజు స్పెషల్ కదా. సింపుల్‌గా అలా చెప్పేస్తే ఏం బాగుంటుంది. చిన్న గిఫ్ట్ ఇవ్వడం ద్వారా దీన్ని స్పెషల్‌గా చేసుకోవచ్చు. మరి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనే డౌట్ వద్దు. ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీ కోసమే.