ఏదైనా సమస్య వచ్చినప్పుడు... ముందు సమస్య ఏంటో అర్థం చేసుకుంటే... దానికి సరైన పరిష్కారమూ ఆలోచించవచ్చు. కళ్ల కింద నల్ల చారలు అందరికీ రావు. సరిగా నిద్రపోకపోయినా... ఎండలో ఎక్కువగా తిరిగినా... అదే పనిగా మొబైల్ లేదా కంప్యూటర్ల ముందు ఉన్నా... బాగా అలసిపోతే క్రమంగా కళ్ల కింద నల్ల చారలు రావడం మొదలవుతుంది. ఒత్తిడి, టెన్షన్లు, డిప్రెషన్ వల్ల కూడా ఇవి వస్తాయి. కొంతమందికి మాత్రం జన్యుపరంగా వస్తుంటాయి. సంపూర్ణంగా నిద్రపోతూనే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వీటిని వదిలించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Tomatoes: నల్ల చారల్ని చాపచుట్టేడటంలో టమాటాలకు తిరుగులేదు. చర్మంపై మచ్చల్ని కూడా టమాటాలు పోగొడతాయి. ఓ టీస్పూన్ టమాటా రసం తీసుకోండి. ఓ టీస్పూ నిమ్మ రసంలో కలపండి. వాటిని కళ్ల కింద అప్లై చెయ్యండి. 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. ఇలా రోజుకు 2 సార్లు చెయ్యండి. క్రమంగా చారలు మాయమవుతాయి. మీరు టమాటా జ్యూస్, లెమన్ జ్యూస్, పుదీనా జ్యూస్ వంటివి కూడా తాగితే మంచిదే. (ప్రతీకాత్మక చిత్రం)
Cucumber: దోసకాయలో చాలా నీరు ఉంటుంది. ఇది మన బాడీని డీహైడ్రేషన్ సమస్య నుంచి కాబాడుతుంది. అలాగే... చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మానికి చాలా అవసరం. దోసకాయల్లో K, A, E, C విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మంలో రక్త కణాల్లో సాగే గుణాన్ని పెంచుతాయి. రక్తం గడ్డకట్టడాన్ని తొలగిస్తాయి. అందువల్ల వీలైనన్నిసార్లు దోసకాయలు, కీర దోసకాయలూ తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)