అసలే కరోనా కాలం.. పైగా ఇది వ్యాధుల వ్యాపిస్తున్న సమయం. ప్రస్తుత పరిస్థితులో ప్రెగ్నెంట్ మహిళలు సమతూల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణులు వారి డైట్లో చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ మహిళలు వారు తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ప్రోటీన్, విటమిన్ బీ, కాల్షియం, జింక్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పన్నీర్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.
పెరుగు..
పెరుగులో కాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది మంచి పోబెయోటిక్ (probiotic). దీన్ని రాత్రివేళలో తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. మధ్నాహ్నం సమయంలో తమ ఆహారంతోపాటు తీసుకోవాలి.
హెల్తీ నట్స్, సీడ్స్..
ఆరోగ్యకరమైన ఆహారమైన నట్స్ అంటే బాదం, జీడిపప్పు, అక్రూట్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ (omega fatty 3 acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో మంచివి.