ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. ఇందుకు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దాదాపు అందరూ బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వంటి పేర్లు వినే ఉంటారు. అయితే గ్రీన్ కలర్లో ఉండే పిస్తాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు ఇది నిలయం. రెగ్యులర్ డైట్లో పిస్తాలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
* గుండెకు మంచిది : పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది క్రమంగా గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన చాలా రుగ్మతలు అనారోగ్యకరమైన బరువు పెరగడం వల్ల సంభవిస్తాయి. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి, చివరికి స్ట్రోక్‌కి దారి తీస్తుంది. పిస్తా ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలోని కేలరీల స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గిన్నెలో పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల క్యాలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా రక్తం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.
* బరువు తగ్గించడంలో భేష్ : పిస్తా అధిక శక్తిని అందించినా.. బరువు తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది. పిస్తాపప్పులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. పిస్తా పప్పు తరచూ తీసుకోవడం ద్వారా బాడీ మాస్ ఇండెక్స్(BMI) తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
* ఆరోగ్యకరమైన చర్మం : చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ E మరియు యాంటీఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర యొక్క శ్లేష్మ పొర యొక్క కణ పొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన UV కిరణాలు నుండి చర్మం రక్షిస్తుంది, చర్మం వ్యాధులు నుండి నిరోధిస్తుంది మరియు చర్మం ఆరోగ్యంగా మరియు మరింత అందమైనదిగా చేస్తుంది.