Health Tips: చూడటానికి పింటో బీన్స్ కూడా రెగ్యులర్ బీన్స్లాగే కనిపిస్తాయి. కాకపోతే ఇవి ప్రత్యేక రకం. ఈ గింజలు ఎరుపు, గోధుమ రంగు తొక్కతో ఉంటాయి. వండినప్పుడు కొద్దిగా గోధుమ, పాలిపోయిన గులాబీ రంగులో కనిపిస్తాయి. ఇవి మంచి రుచితో, వంటడానికి ఎంతో ఈజీగా ఉంటాయి. వీటిలో ఫుల్లుగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎంతో ఆరోగ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
పింటో బీన్స్‌లో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. వాటిలో చాలా విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి. ఒక కప్పు (171 గ్రాములు) పింటో బీన్స్‌ని ఉప్పుతో ఉడికించి తింటే... 245 కేలరీల ఎనర్జీతోపాటూ... కార్బోహైడ్రేట్స్ 45 గ్రాములు, ఫైబర్ 15 గ్రాములు, ప్రోటీన్ 15 గ్రాములు, ఫ్యాట్ 1 గ్రాము, సోడియం 407 మిల్లీ గ్రాములు, థయామిన్ 28 శాతం (రోజులో కావాల్సింది), ఐరన్ 20 శాతం (రోజులో కావాల్సింది), మెగ్నీషియం 21 శాతం (రోజులో కావాల్సింది), ఫాస్పరస్ 20 శాతం (రోజులో కావాల్సింది), పొటాషియం 16 శాతం (రోజులో కావాల్సింది) లభిస్తాయి. థయామిన్ (విటమిన్ B1) మనకు అత్యంత ముఖ్యం. ఇది ఆహారాన్ని ఎనర్జీగా మార్చుతుంది. పింటో బీన్స్‌లో జింక్, కాల్షియం కూడా ఉంటాయి. ఉప్పు లేకుండా కూడా వీటిని ఉడికించుకొని తినవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)