మాంసాహార ప్రియులైనా, శాఖాహార ప్రియులైనా... ఎవరైనా సరే... ఏవో ఒక పచ్చళ్లు తినడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. కొంత మంది టమాటా చట్నీ, మరికొందరు ఎండుమిర్చి అంటే ఇష్టపడతారు. ఇక చికెన్ చెట్నీలు, మటన్ చెట్నీలు కూడా ఈ రోజుల్లో ఉంటున్నాయి. ఇలా... ఎక్కువ ఉప్పు, నూనెతో... ఆహార పదార్థాల్ని నిల్వ ఉంచే ఆచారం శతాబ్దాలుగా ఉంది.
సాధారణంగా పచ్చడి తయారుచేసేటప్పుడు దానికి నూనె లేదా వెనిగర్ కలుపుతారు. పండైనా, కాయగూర పచ్చడైనా అయినా... ఆయిల్ లేదా వెనిగర్ కలిపితే... దానికి లాక్టిక్, సిట్రిక్, ఎసిటిక్ యాసిడ్లు కలుస్తాయి. ఈ మూడు యాసిడ్లూ... మన శరీరానికి మేలు చేస్తాయి. ఇవి మన శరీరం పటిష్టంగా, యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. మన పొట్టలో ఇవి మైక్రోబ్స్లాగా పనిచేస్తాయి. ఫలితంగా... పచ్చళ్లు తినడం వల్ల మన బాడీలో జీర్ణక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. బాడీలో మెటబాలిజం (అన్ని అవయవాలూ పద్ధతిగా పనిచేయడం) మెరుగవుతుంది. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.
అయితే, కొన్ని పరిశోధనలు పచ్చళ్లు ప్రమాదకరం అని కూడా చెబుతున్నాయి. పచ్చళ్లలో ఎక్కువగా క్యాలరీలు ఉండవు. అందువల్ల పచ్చడితో భోజనం చేసిన వారికి ఎనర్జీ సరిపోదు. పైగా పచ్చళ్లు త్వరగా అరిగేలా చేస్తాయి. కాబట్టి మళ్లీ త్వరగా ఆకలి వేసేలా చేస్తాయి. అందువల్ల పచ్చడితో తినేవారు... ఆ తర్వాత ఆకలేసి... అనారోగ్యకరమైన ఇతర ఆహార పదార్థాలు, స్నాక్స్ వంటివి ఎక్కువగా తినే ప్రమాదం ఉందంటున్నాయి కొన్ని పరిశోధనలు.
అలాగే, పచ్చళ్లు ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చళ్లలో అష్టమిప్రిడ్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది. మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే పదార్థం కావున పరిమిత పరిమాణంలో మాత్రమే ఊరగాయలను తినండి. ఎక్కువగా తింటే లైంగిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మగవారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఇంట్లో తయారుచేసిన ఊరగాయలను పరిమిత పరిమాణంలో తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెట్లలోని ఊరగాయల్లో రుచిగా ఉండటానికి ఎక్కువ నూనె, మసాలాలను ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి చెడు జరుగుతుంది. పచ్చళ్లలో నూనె ఎక్కువగా ఉండటం వల్ల అందులో వాడే మసాలాల వల్ల కొలెస్ట్రాల్ తదితర శారీరక సమస్యలు తలెత్తుతాయి.