మనం ఇప్పటివరకు పసుపు ప్రయోజనాల గురించి మాత్రమే ఎక్కువగా విన్నాం. పసుపును పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. పసుపులో విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, సోడియం, ప్రొటీన్, జింక్, మాంగనీస్, పొటాషియం ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం )
1. కిడ్నీల్లో రాళ్లు ఉన్న రోగులు
కిడ్నీల్లో రాళ్లు ఉన్న రోగులు తమ వైద్యుల సలహా మేరకు పసుపును ఎల్లప్పుడూ తీసుకోవాలి. తరచుగా రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కావున వీలైనంత వరకు పసుపు తీసుకోవడం తగ్గించి.. వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి.(ప్రతీకాత్మక చిత్రం )
2.డయాబెటిక్ రోగులు
మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. డయాబెటీస్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, రక్తం పలుచబడే మందులను ఇస్తారు. అటువంటి పరిస్థితిలో పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తాన్ని తగ్గించవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం )