Chicken: చికెన్‌ను చూడగానే కొంత మంది లాగించే దాకా వదిలిపెట్టరు. కొంతమంది వారానికి సరిపడా చికెన్ ఒకేసారి కొని... ఫ్రిజ్‌లో పెట్టి... రోజూ వండుకొని తింటుంటారు. ప్రోటీన్స్ కోసం చికెన్ తినడం మంచిదే కానీ రోజూ తినడం మాత్రం ప్రమాదమే. వారానికి 2 లేదా 3 సార్లు చికెన్ తినవచ్చు గానీ... రోజూ మాత్రం తినవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
చికెన్‌తో వంద రకాలుగా వండుకోవచ్చు. ఇతర కూరలతో చికెన్ ఫ్రై తినవచ్చు. రోటీలు, చపాతీలు అన్నింట్లోకీ చికెన్ సెట్ అవుతుంది. అందుకే చాలా మంది దీన్ని డైలీ తింటున్నారు. మాంసంతో పోల్చితే... చికెన్‌లో ఫ్యాట్ తక్కువే. అందుకే ప్రజలు చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ రోజూ తింటే ఏమవుతుందో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ రోజూ 35 శాతానికి మించకూడదు. మరోలా చెప్పాలంటే.. రోజూ 50 గ్రాములకు మించి చికెన్ తినకూడదు. అంటే వారానికి 350 గ్రాములు. అంతకంటే ఎక్కువ తింటే... చికెన్ ద్వారా వచ్చే ప్రోటీన్‌ను బాడీ... ఫ్యాట్‌గా మార్చి లోపలే దాస్తుంది. దాంతో బరువు పెరగడం మొదలవుతుంది. బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. అది ప్రమాదకరం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)