Peepal Tree: రావి ఆకులు, కాయలు, బెరడుతో అనేక రోగాలు మాయం.. మగాళ్లకు ఓ వరం..!
Peepal Tree: రావి ఆకులు, కాయలు, బెరడుతో అనేక రోగాలు మాయం.. మగాళ్లకు ఓ వరం..!
Peepal Tree: హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు, కాయలు, బెరడులకు అనేక రోగాలను మాయం చేసే శక్తి ఉంది.
హిందువులు పవిత్రం భావించి దేవతా స్వరూపంగా కొలిచే చెట్లలో ఒకటి రావి చెట్టు. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. రావి ఆకులు, కాయలు, బెరడులకు అనేక రోగాలను మాయం చేసే శక్తి ఉంది.
2/ 9
రావి చెట్టు ఆకులు మలబద్ధకం, విరేచనాలు మరియు రక్త సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. ఎందుకంటే రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియాయిడ్, ఫినాలిక్ లక్షణాలు ఉంటాయి.
3/ 9
రావి చెట్టులోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందువలన.. ఈ మొక్క వివిధ వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులు, బెరడు, కాండం, గింజలు, పండ్లు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు.
4/ 9
జీ న్యూస్ ప్రకారం, రావి ఆకుల లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి రావి ఆకుల రసాన్ని తాగండి. ఇది మ్యూకస్ సమస్యను కూడా నయం చేస్తుంది.
5/ 9
రావి ఆకుస రసం ఊపిరితిత్తులను శుద్ది చేయడానికి పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో మంట తగ్గుతుంది. రావిఆకు రసం తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి.
6/ 9
రావి ఆకు రసం డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలినాలు తొలగిపోవడం వల్ల మొటిమలు, ముఖంపై మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి.
7/ 9
రావి ఆకు రసం దంతాలు మరియు చిగుళ్ళకు కూడా మేలు చేస్తుంది. దీంతో నోటిలోని బ్యాక్టీరియా నశించి చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
8/ 9
పిందె ఆకుల రసాన్ని తాగడం వల్ల డయేరియా సమస్య నయమవుతుంది. డయేరియాతో పాటు వికారం సమస్య ఉన్నా ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
9/ 9
తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మగాళ్లకు ఇది ఓ వరంలా పనిచేస్తుంది.