శారీ విషయానికి వస్తే.. చీరం పూర్తిగా పూనం మెటీరియల్. శారీ బార్డర్ గోల్డెన్ డిజైన్ గ్రాండ్ లుక్నిస్తోంది. ఈ రకమైన చీర పండుగ రోజు, ఫ్రెండ్స్ పార్టీలకు కట్టుకుంటే.. బాగుంటుంది. మొత్తం శారీ మల్టీ కలర్లో పూల డిజైన్‌తో ఉంటుంది. ఇది రంగురంగులుగా కనిపిస్తుంది. ఇక స్నేహ ధరించిన రెడ్ కలర్ బ్లౌజ్ అందానికే నిదర్శనంగా ఉంది.
డ్రెస్..
మన రూపాన్ని అందంగా మార్చడంలో మనం ధరించే దుస్తులు కీలక పాత్ర పోషిస్తాయి. స్నేహ మెడలో ఒక నెక్లెస్‌ను ధరించారు. అది చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. నెక్లెస్‌లో పొదిగిన రాళ్లు చీరతో సరిపోలుతాయి. స్నేహ ఆ నెక్లెస్‌కు సరిపోయే పెద్ద చెవికమ్మలు, చేతికి ఉంగరం కూడా పెట్టుకున్నారు. మేకప్, హెయిర్‌స్టైల్ విషయానికి వస్తే.. స్నేహ అలంకరణ ఆమె డ్రెస్‌కు సరిగ్గా సరిపోయింది. కళ్లపై ఐ లైనర్, కాజల్, పెదవులకు పీచ్ లిప్ స్టిక్ పెట్టుకున్నారు. పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ విషయంలో ఈక్వల్ ఇంపార్టెన్స్‌ను ఇచ్చారు. మీరు కూడా ఈ దీపావళికి మెరవాలనుకుంటే.. ఈ స్టైలింగ్ చిట్కాలను ఫాలో అవ్వండి మరీ...