ఎందుకంటే కల్తీ నెయ్యిని వాడితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. మరి అసలైన, నాణ్యమైన నెయ్యిని గుర్తించేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా నకిలీ నెయ్యిని పట్టేయవచ్చు. అసలైన నెయ్యిని గుర్తించేందుకు అందులో 4 లేదా 5 చుక్కలు అయొడిన్ వేయండి. అది నీలి రంగులోకి మారితే నకిలీదని అర్ధం. నెయ్యి ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వలన ఈ రంగు వస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర వేయండి. దానికి హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేశారని గ్రహించాలి.నెయ్యి నాణ్యత సింపుల్గా ఎలా గుర్తించేందుకు ఇంకో చక్కటి చిట్కా ఉంది. చేతిలో కాస్త నెయ్యి వేసి.. రెండు చేతితో బాగా రుద్దాలి. కాసేపయ్యాక నెయ్యి వాసన రాదు. నాణ్యమైన నెయ్యి ఎప్పుడూ సువాసనతో ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసనపోదు. వాసనపోయిదంటే అది కల్తీ నెయ్యే.(ప్రతీకాత్మక చిత్రం)