రోజ్ వాటర్ ఫోమ్ స్ప్రే: స్ప్రే బాటిల్లో స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసి, క్లెన్సర్ సహాయంతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు రోజ్ వాటర్ ను ముఖంపై స్ప్రే చేసి 20 సెకన్ల పాటు వేచి ఉండండి. తర్వాత కాటన్ బాల్ తో తుడవాలి. ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది . pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది మొటిమలను కలిగించదు..
విటమిన్ సి,రోజ్ వాటర్: ఒక గిన్నెలో విటమిన్ సి మాత్రల పొడిని తయారు చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయండి. ఇప్పుడు శుభ్రమైన చర్మంపై అప్లై చేయండి.. 10 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. విటమిన్ సి దెబ్బతిన్న చర్మాన్ని నయం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల, చర్మంపై దద్దుర్లు త్వరగా నయం అవుతాయి.