Banana Stem: అరటి చెట్టు కాండం మిమ్మల్ని ఈ భయంకరమైన వ్యాధి నుంచి కాపాడుతుందని తెలుసా?
Banana Stem: అరటి చెట్టు కాండం మిమ్మల్ని ఈ భయంకరమైన వ్యాధి నుంచి కాపాడుతుందని తెలుసా?
Health benefits of Banana Stem: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తియ్యగా ఉండే ఈ పండు శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తుంది. ఐతే కేవలం అరటి పండే కాదు.. చెట్టు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
అరటి చెట్టు కాండంతో చేసిన జ్యూస్.. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. శరీరంలోని వివిధ రకాల టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అరటి బెరడు రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు తినే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుందట. తద్వారా గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్ పడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అంతేకాదు దీని రసం మరొక పెద్ద వ్యాధి నుంచి కూడా కాపాడుతుంది. అరటిచెట్టు రసంలో ఏలకులు కలిపి తాగితే మూత్రనాళానికి సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అరటి బెరడు జ్యూస్‌లో నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుందట. మన శరీరానికి ఈ జ్యూస్ అంత మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
బరువు తగ్గేందుకు మనలో చాలా మంది అనేక ప్రయోగాలు చేస్తుంటారు. వీరికి కూడా అరటి బెరడు రసం దోహదపడుతుంది. ఈ రసాన్ని తాగితే ఊబకాయం తగ్గుతుందట.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అరటి బెరడు రసం తీసుకుంటే శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలోకి వస్తుందట. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇంకా ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)