మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా మీరు ఎక్కడైనా షార్ట్ ట్రిప్ వెళ్లినా.. ఓ రెండు రోజులు అలా సరదాగా తిరిగి రీచార్జ్ అయి రావచ్చు. కారు, బస్సు, ట్రైన్ లేదా ఫ్లైట్ లో అయినా వెళ్లిరాగల ఈ ప్రాంతాలు మనదేశంలో ఏటా ఎంతోమంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. బడ్జెట్ లో ఇలాంటి ప్రాంతాలు చుట్టేయవచ్చు కనుక దీనికి ప్లానింగ్ పెద్దగా అవసరం లేదండోయ్.. చిన్న బడ్జెట్ లోనే ఫుల్ ఎంజాయ్మెంట్ సాధ్యమయ్యే ఇలాంటి ప్రాంతాల్లో మీకు ఆహారం, అకామిడేషన్ వంటి ఎటువంటి సమస్యలు ఎదురుకావు. హోం స్టేలు కూడా దొరికిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
నల్దెహ్రా ( Naldehra ) సిమ్లాకు దగ్గర్లో ఉన్న నల్దెహ్రా చాలా తక్కువ జనసమ్మర్దంతో ఉంటుంది. వణికించే చలిలో హిమాచల్ అందాలు చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. అందమైన, స్వచ్ఛమైన గాలి, కొండలు, సీనరీలు ఇలా ఒక్కటేమిటి ఒక్కసారి నల్దెహ్రా వచ్చారంటే ఇక ఇది మీ ఫేవరెట్ డెస్టినేషన్ అవ్వటం ఖాయం. కాస్త డిజిటల్ డీటాక్స్ కూడా మీరు చేయగలిగితే మరో ప్రపంచంలో విహరించినట్టు ఇక్కడి వాతావరణం మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంది
రిషికేష్ ( Rishikesh) ప్రపంచ పర్యాటకులకు ఇది అతిపెద్ద అట్రాక్షన్ గా అలరారుతోంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇక్కడ పెద్దగా విదేశీ పర్యాటకుల సందడి లేదు. స్వచ్ఛమైన గంగా నది ఒడ్డున ఉన్న రిషికేష్ కు ఎన్నిసార్లు వచ్చినా సరికొత్తగా, మొదటిసారి వచ్చిన భావననే కలిగిస్తుంది. మీరు ఫ్రెండ్స్ తో వెళ్లినా, కుటుంబ సభ్యులు, బంధువులతో వెళ్లినా సూపర్ గా ఉండే రిషికేష్ కి మీరు సోలో ట్రిప్ ట్రై చేయండి. అడ్వెంచర్ గేమ్స్, ధ్యానం, యోగా, మంచి ఆర్గానిక్ ఫుడ్.. ఇలాంటి అట్రాక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. వరల్డ్ యోగా కాపిటల్ అయిన రిషికేష్ లో ప్రశాంతంగా గడపవచ్చు.
మహాబలేశ్వర్ ( Mahabaleswar) ముంబై, పూనే కు అత్యంత సమీపంలోని మహాబలేశ్వర్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సెలబ్రిటీలు చాలా మంది ఇక్కడ రీసార్టులు కట్టుకుని వీకెండ్స్ లో తరచూ వస్తుంటారు. కొండలు, హోరున వీచే గాలి, పచ్చని చెట్లు.. ఈ సుందర దృశ్యాలు చాలు మీరు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెల్కం చెప్పేందుకు. ఇది మంచి పిక్నిక్ స్పాట్. అంతేకాదు.. ఓ నాలుగు రోజులు ఉండాలనుకుంటే మీరు బోలెడన్ని మెమరీలతో న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టే చాన్స్ కూడా దొరుకుతుంది.
జైపూర్ (Jaipur) పింక్ సిటీ జైపూర్, రాజస్థాన్ రాజధాని కావటంతో ఇక్కడికి చేరుకునేందుకు అన్ని రకాల రవాణా సౌకర్యాలున్నాయి. నోరూరించే రాజస్థానీ రుచులు, అంబర్ ఫోర్ట్ తో పాటు ఎన్నో చారిత్రక కట్టడాలకు ఆలవాలమైన ఈ నగరంలో మీరు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే థ్రిల్లింగా ఉంటుంది. ఎటుచూసినా సెల్ఫీ స్పాట్లు, శుభ్రంగా ఉన్న నగరం, గత చరిత్రకు ఘనమైన సాక్షాలుగా ఉన్న జైపూర్ కు జై కొట్టిచూడండి. ఫొటోగ్రాఫీ అంటే మీకు ఇష్టమైతే, ఇక జైపూర్ లో అడుగడుగునా క్లిక్ మనిపించేందుకు బోలెడంత మెటీరియల్ మీకు ఇట్టే దొరికిపోతుంది. హవా మహల్ అందాలు, జంతర్ మంతర్ లోని ఖగోళ శాస్త్ర రహస్యాలు అన్నీ వెలికితీసేందుకు కొత్త సంవత్సరం మంచి ముహూర్తం.
మెక్లాండ్గంజ్ ( McLeodganj) ధర్మశాలకు అత్యంత సమీపంలో ఉన్న మెక్లాండ్గంజ్ అందాలు చూస్తే ఎవరైనా పరవశించిపోతారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా జిల్లాలోని ఈ సుందరమైన పర్వత శ్రేణుల్లో మీరు మిమ్మల్నిమరచిపోవటం ఖాయం. టిబెటన్ వంటలు, నార్త్ ఇండియన్ వంటలు మాత్రమే దొరికే ఈ ప్రాంతంలో పళ్లు కొరికే చలి వెంటాడుతుంటే .. పొగలు కక్కుతున్న వేడివేడి పొగలు కక్కే ఆహార పదార్థాలు తింటూ, ఫొటోలు తీసుకుంటూ.. భలే గమ్మతైన లోకం అని మీచేత అనిపిస్తుంది మెక్లాండ్గంజ్ అందం. వాతావరణ కాలుష్యం కించుత్తు కూడా లేకుండా ఉండే ఈ అందమైన కొండలు, గుట్టలు, లోయలు మీకు జీవితకాలపు మాధుర్యాన్ని మూటగట్టి జ్ఞాపకాలుగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపుతాయి.