ఈ మధ్యకాలంలో చాలామంది మేకప్ వేసుకుని మెరిసిపోతున్నారు. అయితే... వచ్చిన చిక్కల్లా మేకప్‌ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం.. దీనివల్ల ఎన్నో చర్మసంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలా కాకుండా ఉండాలంటే.. మేకప్‌ని ఇలా ఈజీగా తొలగించండి..
2/ 5
మేకప్‌ని తొలగించాలంటే రిమూవరే ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాడే వస్తువుల ద్వారా కూడా తొలగించొచ్చు. కొబ్బరినూనెలో కాసింత తేనె కలిపి మేకప్‌ని తొలగించొచ్చు.
3/ 5
అదేవిధంగా పాలల్లో ఆలివ్ ఆయిల్ కలిపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మేకప్‌ని క్లీన్ చేసుకోవాలి..
4/ 5
తేనెలో కొద్దిగా వంటసోడా ఉప్పు చల్లి... దానితో మేకప్‌ని క్లీన్ చేస్తే మేకప్ పోవడమే కాదు.. చర్మం మృదువుగా మారుతుంది.
5/ 5
మేకప్ పోయింది కదా అని.. అలానే పడుకోకూడదు.. ఖచ్చితంగా నీటితో శుభ్రం చేసుకున్నాకే నిద్రపోవాలి. లేకపోతే మేకప్‌లోని కెమికల్స్ చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి.