Telugu: తెలుగు భాషకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఇతర భాషల్లో పదాల్ని తనలో కలిపేసుకోగలదు. అందుకే గ్లాస్, రోడ్డు, బస్, లిఫ్ట్, సీటు, స్వీటు ఇలాంటి పదాలన్నీ వేరే భాషలవి అయినప్పటికీ... తెలుగులో కలిసిపోయి తెలుగులా అయిపోయాయి. తద్వారా ఈ భాష మనుగడ సాగించగలుగుతోంది. ఐతే... ఇప్పుడు అసలు సమస్య వస్తోంది. పిల్లలంతా ఇంగ్లీష్ చదువులు చదువుతుంటే... వారికి తెలుగు తప్ప అన్నీ వస్తున్నాయి. ఈ సమస్యను పిల్లల తల్లిదండ్రులు గమనిస్తున్నారు. పిల్లలకు తెలుగు ఎలా నేర్పాలో వారికి సవాలుగా మారింది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేత తెలుగు యాప్స్ ద్వారా పిల్లలకు భాష ఎలా నేర్పాలో తెలుసుకుందాం. (image credit - google play store)
Learn Telugu Quickly: గూగుల్ ప్లే స్టోర్‌లోని ఈ యాప్‌లో... తెలుగు భాష నేర్చుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. భాషను ఎలా పలకాలో కూడా ఇందులో చూపిస్తున్నారు. వేగంగా తెలుగు నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతోంది. పైగా ఇందులో కంటెంట్ చాలా ఎక్కువే ఉంది. బొమ్మల ద్వారా లాంగ్వేజీ నేర్పిస్తుండటం వల్ల పిల్లలకు ఇది వెంటనే అలవాటు అవుతుంది. (image credit - google play store)
Learn Telugu (beta): బీటావెర్షన్‌లో వస్తున్న మరో మంచి యాప్ ఇది. పద్ధతైన తెలుగు నేర్చుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. తెలుగు పదాలు, నుడికారాలు, సామెతలు, నానుడిలు వంటివి అన్నీ ఇందులో నేర్చుకోవచ్చు. రోజువారీ మాట్లాడే పదాలపై ఇందులో ఎక్కువ దృష్టి పెట్టారు. పైగా ఇందులో చిన్న చిన్ నతెలుగు పాఠాళు, క్విజ్ గేమ్స్ కూడా ఉన్నాయి. వాయిస్ గైడెన్స్ ద్వారా పదాలు ఎలా పలకాలో చెబుతున్నారు. తెలుగు భాషపై ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నారు. (image credit - google play store)
Learn Spoken Telugu From English: ఇది మరో మంచి యాప్. ఇందులో అటు ఇంగ్లీష్, ఇటు తెలుగు రెండూ నేర్చుకోవచ్చు. ప్రతీదీ బొమ్మల రూపంలో చూపిస్తున్నారు. అందువల్ల పిల్లలకు త్వరగా అర్థం అవుతుంది. ఇంగ్లీషులో పదాలకు తెలుగు పదాల అర్థాలు ఉండటం వల్ల పిల్లలకు వెంటనే తెలుగు నేర్చుకునేందుకు వీలవుతుంది. ఇందులో కూడా ఆడియో ద్వారా తెలుగు భాష వినేందుకు వీలుంది. రోజువారీ మాట్లాడే తెలుగుపై ఇందులో ఫోకస్ చేశారు. జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, రంగులు, వ్యక్తులు, నంబర్లు, ఆల్ఫాబెట్స్, వ్యాఖ్యాలు వంటివన్నీ ఇందులో నేర్చేసుకోవచ్చు. (image credit - google play store)
Telugu 101 - Learn to Write: తెలుగు అక్షరాలు రాయడం, పలకడం తెలిసేందుకు ఈ యాప్ ద్వారా చక్కటి ప్రయత్నం చేశారు. ఇందులో ఏ అక్షరాన్ని ఎలా రాయాలో చూపిస్తూ... దాన్ని ఎలా పిలవాలో చూపించే వీడియో కూడా ఉంది. నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీకి వెళ్లే పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. వాళ్లు వెంటనే కనెక్ట్ అవుతారు. డిజిటల్ రూపంలో అక్షరాలపై ప్రాక్టీస్ అయ్యేందుకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. (image credit - google play store)