ఆకలి వేసినప్పుడు మనం ఏదో ఒకటి తినడం కరెక్టు కాదు... మనకు ఏ ఆహారం అవసరమో అది తినాలి. ఉదాహరణకు... శరీరంలో రక్తం సరిగా లేనివాళ్లు... క్యారెట్, బీట్రూట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే... ఎప్పుడూ నీరసంగా ఉండేవాళ్లు... గుడ్లు, పాలు వంటివి తింటే మంచిది. అదే బ్యాలెన్స్డ్ డైట్ అంటే. సరే ఇప్పుడు మనం... మనకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఆహారాలేంటో తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పౌష్టికాహారం కోసం మనం లక్షలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. రోజువారీ తినే ఆహారంలోనే ఎక్కువ పోషకాలు ఉన్నవి, ప్రోటీన్స్ ఉన్నవి తింటే మేలు. పౌష్టికాహారం తింటే... అధిక బరువు లేకుండా ఉండటమే కాదు... కండరాలు బలంగా మారతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలేంటో తెలుసుకుందాం.
పెసరపప్పు : చాలా మంది పెసరపప్పును ఫ్రై, స్నాక్స్ రూపంలో తింటారు. అలా తింటే... బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు చేరుతుంది. అది మంచిది కాదు. చక్కగా పెసరపప్పును వండుకొని తింటే ఎంతో మేలు. పెసర లడ్డూలు కూడా మేలు చేస్తాయి. ఐతే... పెసరపప్పను ఎక్కువగా తింటే లావు అవుతారు. కాబట్టి కొద్ది మొత్తాల్లో తీసుకుంటే... ప్రోటీన్స్ లభించడమేకాక... ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.