National Lazy Day 2021: ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఉరుకులు పరుగులు పెడుతూనే ఉన్నారు. ప్రశాంతంగా కాసేపు ఎక్కడా విశ్రాంతి తీసుకోవట్లేదు. బిజీ లైఫ్‌స్టైల్ అయిపోయింది. ఇలా మనం ఎక్కడికి పరుగులు పెడుతున్నామో... ఎందుకో మనకే తెలియదు. ఇలా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడటం కరెక్టు కాదనే అభిప్రాయంతో... సంవత్సరంలో ఒక్క రోజైనా ఏ పనీ లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినదే జాతీయ బద్ధక దినోత్సవం. ఈ రోజున ప్రపంచ దేశాల ప్రజలు చిన్న పని కూడా చెయ్యకూడదన్నది నియమం. పాటిస్తున్నామా... (ప్రతీకాత్మక చిత్రం)
ఇదే లేజీ డేకి మరో ప్రత్యేకత జోడించారు. ఏంటంటే... రోటీన్ వర్క్ మానేసి... ఈ రోజున మీకు నచ్చినది చేయాలి అని. అంటే మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా... దాన్ని ఇవాళ బయటకు తియ్యాలి. బొమ్మలు వెయ్యడం, కవితలు రాయడం, పాటలు పాడటం, డాన్స్, స్విమ్మింగ్, కరాటే... ఇలా మీకు ఏ టాలెంట్ ఉంటే... దాన్ని ఇవాళ ప్రదర్శించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సందర్భంగా ఓ చందమామ కథ చెప్పనా. పూర్వం ఓ రాజు ఇద్దరు బద్ధకస్తులను తన ఆస్థానంలో ఉంచుకోవాలి అనుకున్నాడు. ఈ ఉద్యోగానికి చాలా మంది అప్లై చేశారు. అందర్నీ ఓ రోజు పిలిచి... ఓ భవనంలో ఉంచి... దాన్ని తగలబెట్టారు. భవనానికి నిప్పు అంటగానే... బద్ధకస్తులంతా లేచి.. వామ్మో మంటలు... తగలబడిపోతోంది అంటూ పరుగులు పెట్టారు. ఇద్దరు మాత్రం అలాగే ఉన్నారు. ఓ మంత్రి... "అందరూ పారిపోతుంటే... మీరెందుకు వెళ్లట్లేదు" అని అడిగితే... "మంట ఆ చివర ఉంది... ఇక్కడిదాకా వచ్చినప్పుడు వెళ్తాం"... అన్నారు. అంతే... అసలైన బద్ధకస్తులు వారే అని గ్రహించి ఆ రాజు వాళ్లకు జాబ్ ఇచ్చాడు. ఇది కథ మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)