MUST INCLUDE THESE THREE FOOD ITEMS IN YOUR DIET IF YOU ARE IN WORK FROM HOME AK
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? మీరు రోజూ తినే ఆహారంలో ఈ మూడు కచ్చితంగా ఉండేలా చూసుకోండి
Work From Home Diet: ఇంటి నుంచి పని చేసే సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలనే విషయంలో చాలామందికి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి.
కరోనా అనంతరం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అన్ని వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ చాలామంది ఐటీ ఉద్యోగులు, పలు ఇతర రంగాల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 9
అయితే ఇంటి నుంచి పని చేసే సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలనే విషయంలో చాలామందికి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. దీనిపై ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ రుజుత దివాకర్ పలు సూచనలు చేశారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఇంటి నుంచే పని చేస్తున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో రాజీపడేలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు. ఇంట్లో ఉన్న సమయంలో చాలామంది ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ మీద దృష్టి పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆహారం తీసుకోవడంలో సమతుల్యత ఎలా పాటించాలనే విషయాన్ని రుజుత తెలిపారు.((ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 9
మన తీసుకునే ఆహారంలో కొన్నింటిని ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు మన డైట్లో కచ్చితంగా తాజా పండ్లు ఉండాలని తెలిపారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 9
స్థానికంగా దొరికే తాజా పండ్లనే తీసుకోవాలని తెలిపారు. సీజనల్గా దొరికే పండ్లతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను కూడా తీసుకోవాలని అన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో మీ డైట్లో డ్రైఫ్రూట్స్ ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని రుజుత తెలిపారు. ఇది ఎముకల వృద్ధికి ఎంతో సహకరిస్తుందని అన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
7/ 9
గుండెకు సంబంధించిన ఆరోగ్యానికి వేయించిన పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పల్లీలతో బెల్లం కలుపుకుని తినడం ద్వారా షూగర్ కంట్రోల్లో ఉంటుందని సూచించారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఇక ఇంటి నుంచి పని చేసేవాళ్లు తమ ఆహారంలో నెయ్యి కూడా ఉండేలా చూసుకోవాలని రుజుత తెలిపారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవడం ఎంతో మేలు అని తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం)
9/ 9
నెయ్యిలో జీర్ణక్రియకు మేలు చేసే ఎంతో పోషకాలు ఉంటాయని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ఎన్నో సమావేశాలు, మరి కాస్త ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుందని.. ఇలాంటి వారికి నెయ్యి తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం)