బరువు ఈజీగా తగ్గాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతీ రోజు కనీసం అర గంట నుంచి 90 నిమిషాలు నడవాలని (Walking for weight loss) వైద్యులు చెబుతున్నారు. అయితే, రోజూ నిర్ధారిత సమయంలో నవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు (2.5 గంటలు) వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నడవమన్నారు కదా అని చాలామంది నామ్ కే వస్తే అన్నట్లుగా నడక మొదలు పెడతారు. అలా నడవడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
మీరు 30 నిమిషాలు నడవాలని నిర్ణయించుకున్నట్లయితే. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవచ్చు. ముందుగా కాసేపు వార్మింగ్ అప్ చేసిన తర్వాతే వాకింగ్ మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే అప్పటి వరకు బిరుకుగా ఉన్న కండరాలు వార్మింగ్ అప్ తో ఆక్టివ్ అవుతాయి. మొదటిసారి వాకింగ్ (walking)చేసేవారు.. ఒక్కసారే ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడవకూడదు. నెమ్మది నెమ్మదిగా దూరాన్ని, సమయాన్ని పెంచుకోవాలి. లేకపోతే మొదటి రోజు అతిగా నడిస్తే రెండో రోజు నడవడం కష్టమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
దీనివల్ల మీలో శ్రద్ధ తగ్గిపోతుంది. వర్షం వచ్చిందనో, మరేదైనా కారణంతో నడకను ఒక్కరోజు కంటే ఎక్కువ రోజులు వాయిదా వేయకుడదు. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నడవడమే మంచిది. దీనివల్ల క్యాలరీలు కరగడమే కాకుండా మీ శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఒక వేళ బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే వ్యాయామం చేయడానికి ప్రయత్నించడం మంచిది. . (ప్రతీకాత్మక చిత్రం)
బరువు తగ్గాలంటే రోజూ కనీ గంట నుంచి గంటన్నర నడవాలి (Should walk). అలాగే, అధిక క్యాలరీలు కలిగిన ఆహారానికి (Food) కూడా దూరంగా ఉండాలి. బీజీ లైఫ్ వల్ల చాలామందికి కనీసం అరగంట వాకింగ్ చేసే సమయం కూడా ఉండదు. అలాంటివారు రోజులో కనీసం మూడు సార్లు 10 నిమిషాల చొప్పున నడవడానికి ప్రయత్నించండి. (ప్రతీకాత్మక చిత్రం)