Fatigue: నిద్ర లేచిన వెంటనే మంచం దిగి నడవటానికి మీకు శక్తి ఉండడం లేదా? పని చేసిన వెంటనే మరో పని చేయలేపోతున్నారా..? అయితే మిమ్మల్ని అలసట ఆవరించినట్టే లెక్క.. దానికి కారణాలేంటో తెలుసుకోండి
నిద్ర తక్కువగా పోయే వారిలో అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత, ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి నిద్రకు ముందు మొబైల్, టీవీ, వీడియో గేమ్స్ లాంటివి ఉపయోగించొద్దు. Image source Pexels
2/ 7
ఎక్కువ నిద్రపోతే శరీరానికి ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయంపాటు నిద్రపోతే అలసట దరి చేరుతుంది. Image source Pexels
3/ 7
చాలా తక్కువ తినడం వల్ల అలసట వస్తుంది. అటు తినాల్సిన అహారాలు కాకుండా తినకూడని ఆహారాలు తినడం కూడా సమస్యకు కారణం కావచ్చు. Image source Pexels
4/ 7
మీ మొత్తం ఆరోగ్యానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. మీ శరీరానికి తగినంత నీరు లేనప్పుడు నీరసించిపోతాం. Image source Pexels
5/ 7
దీర్ఘకాలిక ఒత్తిడి మీ శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతుందని తేలింది. ఒత్తిడిని నివారించడం కొన్ని సమయాల్లో అసాధ్యం అయితే, మీకు సహాయపడటానికి మీరు యోగా లేదా ధ్యానం వంటి ఒత్తిడి-నిర్వహణ వ్యూహాలను అవలంబించవచ్చు.Image source Pexels
6/ 7
ప్రతిరోజూ ఉదయం పూట టీఫిన్ చాలా ఇంపార్టెంట్. అది మానేస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాఫీలాంటి కెఫీన్ కంటెంట్ మీద ఎక్కువగా ఆధారపడద్దు. చక్కెర స్థాయిలను సమంగా ఉంచుకునేలా ఉదయం అల్పాహారం తప్పనిసరి. Image source Pexels
7/ 7
తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల... రక్తహీనత వస్తుంది. రక్తహీనత చురకుతనం తగ్గుతుంది. Image source Pexels