Hair Fall: ఈ రోజుల్లో ఎక్కుమంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం (hair Fall) చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా ఈ సమస్యను ఫేస్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలైతే దీని ఓ పెద్ద సమస్యగా చూస్తున్నారు. ఎందుకు అంటే వారి అందాన్ని రెట్టింపు చేసేవి కురులు.. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. అందుకే జుట్టు రాలితో అమ్మాయిలు అస్సులు తట్టుకోలేరు.. ఆ సమస్య నుంచి బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
అధిక చక్కెర జుట్టు రాలడానికి ఉన్న ప్రధాన కారణాల్లో అధిక చక్కెర ఒకటి. అధిక చక్కెర ఆరోగ్యానికి చాలా హానికరం. కొన్ని నివేదికల ప్రకారం చక్కెరను అధికంగా తీసుకుంటే అది బట్టతలకి కారణం అవుతుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. మీ ఆహారంలో చక్కెరను తగ్గించే దినచర్యను ఈరోజు నుంచే ప్రారంభించండి.
మద్యం
మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కెరాటిన్ అనే ప్రోటీన్ జుట్టులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఆల్కహాల్ ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు ఆల్కహాల్ వల్ల శరీరంలో చాలా పోషకాలు లోపిస్తాయి. దాంతో పాటు జట్టు రాలేలా చేస్తుంది.
చేప
సీ ఫుడ్స్ లవర్స్ కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రోజుల్లో చేపల్లో పాదరసం పరిమాణం పెరిగిందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ పాదరసం చేపల ద్వారా మనలోకి చేరుతుంది.. అందుకే ఆ చేపలను ఎక్కువగా తినే వారికి తరచూ జట్టు భారీగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ నాలుగు ప్రధాన కారణాలతో జట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.