1960వ దశకం చివరి రోజులవి. అప్పట్లో మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాడంటేనే పెద్ద విషయం. అలాంటిది చంద్రమండలంపై అడుగుపెట్టడం (Foot on Moon)... అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలికింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఈ విజయాన్ని అందుకుంది. జాబిల్లిపై మానవ జైత్రయాత్రను అప్పట్లో ప్రపంచ దేశాలు గర్వంగా చెప్పుకున్నాయి. నేటితో ఆ ఘటన జరిగి 52 ఏళ్లు పూర్తయ్యాయి. (image credit - NASA)
1969 జులై 20న మానవుడు చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టాడు. అపోలో-11 స్పేస్ నౌక ద్వారా నీల్ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి... ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. "మనిషి ఈ చిన్న అడుగు.. మానవజాతిని పెద్ద ఎత్తుకు తీసుకెళ్తుంది" అని నీల్ఆర్మ్స్ట్రాంగ్ అక్కడి నుంచి పలికిన మాటలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. (image credit - NASA)
52 ఏళ్ల కిందట ఇదే రోజు అపోలో-11 అంతరిక్ష నౌకలో కమాండర్ నీల్ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ బృందం చంద్రుడిపై యాత్రను దిగ్విజయంగా పూర్తిచేసింది. ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ చంద్రుడిపై అడుగుపెట్టగా.. మైఖేల్ కాలిన్స్ అపోలో-11 కమాండ్ మాడ్యూల్ కొలంబియాను ఉపరితలంపై ల్యాండ్ చేశారు. అంతేకాకుండా కొలంబియా మాడ్యూల్ ద్వారా కోలిన్స్ చంద్రుడు చుట్టూ ప్రయాణించిన తొలి వ్యోమగామిగా ఘనత సాధించారు. (image credit - NASA)
చంద్రుడిపై కమాండ్ మాడ్యూల్ దిగిన 6 గంటల తర్వాత ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టారు. నౌక బయట దాదాపు రెండున్నర గంటల సేపు గడిపారు. తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ తో కలిసి చంద్రుడి ఉపరితలంపై ఉన్న 21.5 కేజీల మట్టి, ఇతర పదార్థాలను సేకరించారు. వాటిని పరిశోధన కోసం భూమిపైకి తీసుకొచ్చారు. (image credit - NASA)
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం చంద్రుడి ఉపరితలంపై 'ట్రాంక్విలిటీ బేస్' అనే ప్రదేశంలో గడిపింది. తర్వాత వారు తిరిగి కొలంబియా కమాండ్ మాడ్యూల్లో ఉన్న కాలిన్స్‌తో కలిసి.. జులై 24న భూమిపైకి వచ్చారు. మానవుడు తొలిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టిన తేదీకి గుర్తుగా.. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్ నిక్సన్ ఈ రోజును నేషనల్ మూన్ డే (National Moon day)గా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అంతరిక్ష సంస్థలు ‘మూన్ డే’ ప్రత్యేక వేడుకలు జరుపుతున్నాయి. (image credit - NASA)
నాసా ఈ ప్రాజెక్టును ఆ సమయానికి అతి గొప్ప మిషన్‌గా అభివర్ణించింది. ఈ మిషన్‌ను టెలికాస్ట్ చేయడంతో లక్షల మంది ప్రజలు ప్రత్యక్ష ప్రసారాన్ని చూశారు. ఆ తరువాత జులై 20 అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా మారింది. అంతరిక్షంలో నూతన అన్వేషణలు, అవకాశాలకు ఈ యాత్ర తెరతీసింది. అపోలో-11 విజయంతో ప్రపంచానికి మరిన్ని మిషన్ల కోసం నాసా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. (image credit - NASA)





