వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు... ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. అందుకే మన పూర్వీకుల నుంచీ ఇప్పటివరకూ పుదీనాను ఎన్నో ఆయుర్వేద ఇతర మందుల తయారీలో వాడుతున్నారు. అంతేకాదు... కాస్మొటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేయిస్తూ... ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నాయి. మన తెలుగువారు... ఎక్కువగా బిర్యానీ, ఇతర వంటల్లో పుదీనా ఆకుల్ని ఉపయోగిస్తారు. ఐతే... పుదీనాతో కలిగే ఎన్నో ప్రయోజనాలు తెలుసుకుంటే... ఈ మొక్కల్ని కూడా ఇళ్లలో పెంచుకోవడం ఖాయం. (image courtesy - twitter)