తల్లిదండ్రులవడం అనేది ప్రపంచంలోని అత్యంత అందమైన భావాలలో ఒకటి, అయినప్పటికీ, చాలా కపుల్స్ గర్భం దాల్చడానికి కష్టపడుతున్నారు. స్త్రీ మరియు పురుషుల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్య దీనికి కారణం కావచ్చు. హార్మోన్ల మార్పులు, వయస్సు, ఊబకాయం వంటి మరిన్ని అనేక కారకాలు మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేయగలవు. మగవాళ్లు... గాయం, మధుమేహం, అతిగా మద్యపానం, ధూమపానం మొదలైన వాటి వల్ల పిల్లలను కనలేకపోవచ్చు. నిజానికి, అనేక జీవనశైలి మార్పులు సంతానోత్పత్తి సమస్యలు మరియు బలహీనమైన లైంగిక పనితీరుకు కూడా దోహదపడతాయి. మీ ఆహారం మరియు రోజువారీ దినచర్యలో కొన్ని మార్పులు చేయడం వలన బెడ్ పై మీ పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంచుకోవచ్చు.
లైంగిక మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరచడానికి ఆహారంలో చేర్చవలసిన విషయాలు : ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ రక్త ప్రసరణను పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి ఇవి చాలా అవసరం మరియు లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిరపకాయలు మరియు మిరియాలు కూడా రక్తపోటు మరియు వాపు తగ్గించడం వలన రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి.ప్రతీకాత్మక చిత్రం)
చెడు అలవాట్లకు నో చెప్పండి : హెల్త్‌లైన్ ప్రకారం, రెడ్ వైన్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది, అయితే ఎక్కువగా మద్యం మరియు ధూమపానం తీసుకోవడం మీ లైంగిక పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రోజూ మద్యం సేవించడం మరియు ధూమపానం చేయడం నేరుగా పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది మరియు వారి స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)