Health Alert: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..
Health Alert: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..
Health Alert: ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని గడిపే వారు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. శారీరక శ్రమ లేకుండా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే కార్మికులు లేదా ఉద్యోగులు ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని గడిపే వారు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. శారీరక శ్రమ లేకుండా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే కార్మికులు లేదా ఉద్యోగులు ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచి పని చేస్తున్నారు.
2/ 8
అయితే ఒకే దగ్గర ఇలా కూర్చొని చేయడం వల్ల అనేక రకాలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయడం అవసరం. వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించడం అవసరం. లేకపోతే శరీరం బలహీనంగా మారుతుంది.
3/ 8
ప్రతీ రోజు ఉత్సాహంగా ఉండాలంటే కూడా వ్యాయామం అనేది శరీరానికి ఎంతో అవసరం. శారీరక ఆరోగ్యం యొక్క స్వభావాన్ని కొన్ని లక్షణాలతో అంచనా వేయవచ్చు. ఆఫీసుకు వెళ్లేవారు మెట్లు ఎక్కే ముందు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే గమనించాలి.
4/ 8
అంతేకాదు సీటుకు వెళ్లే ముందు అలసిపోయినట్లు అనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇది శారీరక బలహీనతకు సంకేతం. మీరు పనికి వచ్చే ముందు ప్రతిరోజూ వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. చాలా మందికి ఉదయం పని ముగించుకుని ఆఫీసుకు వెళ్లే ఉత్సాహం ఉండదు.
5/ 8
ఇంటికి చేరేసరికి అలసిపోయి ఉంటారు. ముఖ్యంగా ఇంటికి వెళ్లాక తినడానికి కూడా ఇష్టం లేకుండా నిద్రపోవాల్సి వస్తుంది. రోజంతా తన పని ప్రదేశం నుంచి కదలకంటే పని చేయడమే దీనికి కారణం. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శక్తి ఆదా కాదు.
6/ 8
అంతే కాదు.. శారీరకంగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం అరగంటకోసారి లేదా గంటకు ఒకసారి అయినా లేచి కొన్ని నిమిషాలు తిరగటం మంచిది. ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు కండరాల కదలికలు బలహీనపడవచ్చు.
7/ 8
శారీరక శ్రమ లేకపోవడం వల్ల, కండరాలు బలహీనంగా మారతాయి. శరీర కండరాలు శరీరాన్ని ప్రతిచోటా తీసుకువెళతాయి. కండరాలు దృఢంగా, బలంగా లేకుంటే శరీరం బలహీనంగా మారుతుంది. ప్రారంభ లక్షణం అలసట.
8/ 8
అప్పుడు మీరు వివిధ వ్యాధులను ఎదుర్కొంటారు. కాబట్టి కండరాలకు తగిన శిక్షణ ఇవ్వడం అవసరం. దాని కోసం ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)