MANY PEOPLE STORE EGGS IN FRIDGE YOU SHOULD KEEP THESE THINGS IN MIND BEFORE DOING THIS SK
Eggs in Fridge: గుడ్లను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే..
Eggs in fridge: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో ఎన్నో పోషక విలువలున్నాయి. కరోనా సమయంలో గుడ్డు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని డాక్టర్లతో పాటు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. అందుకే మనలో చాలా మందికి నిత్యం గుడ్లు తినడం అలవాటు.
గుడ్లు తినే వారు ప్రతి రోజు దుకాణానికి వెళ్లి వాటిని కొనరు. ఎప్పుడో ఒకసారి వెళ్లి ట్రేనో లేదంటే డజన్ గుడ్లో తెచ్చుకుంటారు. వాటిని ఇంట్లో ఏదో ఒక చోట ఉంచి అవసరం అయినప్పుడు వాడుకుంటారు. ఐతే దాదాపు 90శాతం మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఫ్రిజ్ డోర్ వైపున ఉండే ప్రాంతంలో చిన్న ట్రే ఉంటుంది. అందులోనే గుడ్లను నిల్వ చేస్తుంటారు. కానీ ఆ ప్రాంతంలో గుడ్లును స్టోర్ చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం
3/ 6
డోర్ పక్కన ఉండే ట్రేలో గుడ్లు పెడితే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఒకేలా ఉండవు. తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న గుడ్లు పాడవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఫ్రిజ్ డోర్ పక్కన ఎక్కువ రోజుల స్టోర్ చేసిన గుడ్లను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదముందని అంటున్నారు. మరి ఫ్రిజ్ డోర్ సైడ్ కాకుండా గుడ్లను ఎక్కడ స్టోర్ చేయాలి? (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
గుడ్లను ఎయిర్ టైట్ కంటెయినర్లో ఉంచి మూతపెట్టాలి. ఆ కంటెయినర్‌ను ఫ్రిజ్‌లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే గుడ్లకు సరైన రీతిలో చల్లదనం అందుతుంది. అలా ఉంటేనే గుడ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇక గుడ్లకూరను, ఉడకబెట్టిన గుడ్లను కూడా రెండు మూడు రోజులకు మంచి ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అలాంటి గుడ్లు తినడం కన్నా.. బయట పడేయడమే బెటర్ అని నిపుణుల అభిప్రాయం. అందుకే గుడ్లు స్టోర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. (ప్రతీకాత్మక చిత్రం)