Male Fertility: పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అనేదానికి వంద కారణాలు చెప్పుకోవచ్చు. అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నవే. అందుకే పిల్లలు పుట్టాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం... స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాల సంఖ్య) తక్కువగా ఉండటం. సో, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడంపై పురుషులు దృష్టి పెట్టాలి అని సైంటిస్టులు తెలిపారు. ఇందుకోసం రోజూ ట్రీ నట్స్ (TREE NUTS) అంటే... చెట్ల నుంచి వచ్చే గింజలు తినాలి. అంటే బాదం (Almonds), హేజెల్నట్స్ (Hazelnuts), వాల్నట్స్ (Walnuts) వంటివి అన్నమాట. ఇవి మగాళ్లకు ఎంత మంచివంటే... ఇవి శుక్రకణాలకు బలం ఇస్తాయి, శుక్రకణాలను చురుగ్గా చేస్తాయి, మొత్తంగా స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి.