హనీమూన్ అనేది కొత్త జంట జీవితానికి సరికొత్త ప్రయాణం. ఈ రోజుల్లో కొంత మంది పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్తుంటే... మరికొంత మంది పెళ్లికి ముందే వెళ్తున్నారు. ఎక్కువ మంది కొన్ని ప్రదేశాలనే ఎంచుకుంటున్నారు. కాంపెర్ ఐస్లాండ్ సంస్థ... అలాంటి ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో అధ్యయనం చేసింది. ఈ స్టడీలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. కొన్ని ప్రదేశాలకు వెళ్లిన జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. అక్కడకు ఎవరు వెళ్లినా... విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. (pic credit: pexels / Asad Photo Maldives)
హనీమూన్ తర్వాత విడిపోయిన 3,100 దంపతులపై ఈ అధ్యయనం జరిపారు. వీళ్లంతా విడాకులు తీసుకున్నవారే. అధ్యయనం ప్రకారం... ఈ విడాకులు పొందుతున్న హనీమూన్ డెస్టినేషన్లలో మాల్దీవులు టాప్‌లో ఉంది. అక్కడకు వెళ్లిన వారిలో చాలా మంది విడాకులు తీసుకున్నారు. 3100 మందిలో... 620 మంది మాల్దీవులకు వెళ్లారు. అంటే 20 శాతం మంది. మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేసిన వాళ్లు... విడాకులు తీసుకున్నారు.
మొరాకోలోని మరకేషన్.. ఈ లిస్టులో రెండోస్థానంలో ఉంది. ఇక్కడకు 527 మంది వెళ్లారు. అంటే 17 శాతం. హనీమూన్ తర్వాత వీళ్లంతా విడాకులు తీసుకున్నారు. ఇక మూడో స్థానంలో బోరా బోరా ఉంది. ఇక్కడ 13 శాతం మంది విడాకులు తీసుకున్నారు. మరి ఎక్కడకు వెళ్తే... ఈ విడాకుల సమస్య ఉండదు... అనే ప్రశ్న మనకు రావచ్చు. దానికీ సమాధానం ఉంది.
సన్ UK ప్రకారం... థాయిలాండ్, కాన్కన్ (Cancun), బ్యాంకాక్ వెళ్లిన జంటలు విడాకులు తీసుకోవట్లేదట. బ్యాంకాక్‌లోని నాపా వ్యాలీలో హనీమూన్ జరుపుకున్న వారు... అస్సలు విడాకులు తీసుకోవట్లేదట. అలాగే... కాలిఫోర్నియా కూడా సేఫ్ హనీమూన్ డెస్టినేషన్‌గా ఉంది. నాపా వ్యాలీ, బ్యాంకాక్ వెళ్లిన జంటల్లో 1 శాతం మంది మాత్రమే విడాకులు తీసుకున్నట్లు తేలింది. మెక్సికోలోని కాన్కన్కి వెళ్లిన వారిలో 3 శాతం మంది మాత్రమే విడాకులు తీసుకున్నారట. ప్రపంచంలో ఫేమస్ హనీమూన్ డెస్టినేషన్‌గా కాన్కన్ ఉంది.
మీరు హనీమూన్ కోసం బ్రిటన్‌కి వెళ్లొచ్చు. ఎందుకంటే... విడాకులు పొందుతున్న 15 డెస్టినేషన్లలో బ్రిటన్ లేదు. ఐతే... యూరప్ దేశాల్లోని గ్రీస్‌లో... శాంటోరీనికి వెళ్లిన జంటల్లో 5 శాతం మంది, రోమ, వెనిస్ వెళ్లిన వారిలో 5 శాతం మంది, క్రొయేషియాలోని దబ్రోవ్నిక్ వెళ్లిన వారిలో 4 శాతం మంది విడాకులు తీసుకున్నట్లు తేలింది. అసలీ గొడవంతా ఎందుకు అనుకుంటే... సింగిల్‌గా వెళ్లేవారికోసం... సోలోమూన్స్ (Solomoons) కొత్తగా వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఒంటరిగానే వెళ్తూ... విడాకుల సమస్యలు లేకుండా హాయిగా.... తిరిగొస్తున్నారు. వీళ్లలో మగవారు, ఆడవారు కూడా ఉంటున్నారు. హనీమూన్ స్పాట్లకు వెళ్తున్న వారిలో... ఈ సొలోమూన్స్ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.