ముఖ్యంగా మేకప్ వస్తువులను ఎవరితోనూ పంచుకోవచద్దు. అంటే ప్రేమను పంచుకోవడం చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. కానీ, మేకప్ ఉత్పత్తులను సంబంధించిన వరకు అవి చాలా వ్యక్తిగత ఉపయోగం కోసం కాబట్టి మీరు వాటిని ఎవరితోనూ పంచుకోకూడదు. మీ చర్మం పై వేరే వాళ్లు ఉపయోగించిన ఉత్పత్తిని ఉపయోగిస్తే ఇతరుల చర్మంలోని బ్యాక్టిరియా మీ చర్మంలోకి గ్రహిస్తుంది. అంతేకాదు, మేకప్ టూల్ కూడా పాడవుతుంది.
మేకప్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే ముందు గడువు తేదీని తనిఖీ చేయాలి. ఇది అన్ని వస్తువులకు వర్తిస్తుంది. మేకప్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు మీరు దాన్ని ఎంతకాలం ఉపయోగించబోతున్నారో పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మేకప్ ఉత్పత్తులు ఎక్కుగా ఉంటాయి. డిస్కౌంట్లు లేదా ప్రత్యేక ఆఫర్లు తక్కువ ధరకు విక్రయేంచేవి గడువుకు దగ్గరగా ఉన్నాయా చూడండి. అంతేకాదు అవి మీ చర్మానికి హాని కలిగించకుండా చూసుకోవాలి.
ప్రత్యేక బ్రష్‌లు మేకప్ నుంచి హెవీ మేకప్ కళ్లు, కనురెప్పలే, గడ్డం, పెదవులు నుంచి ముఖంలోని ప్రతిభాగానికి వివిధ రకాల మేకప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మేకప్ వస్తువుకు దాని సొంత మేకప్ బ్రష్‌లు ఉంటాయి. మీరు ఒకవేళ కాంపాక్ట్ పౌడర్ ఉపయోగిస్తే.. హైలైటర్‌ను వేసుకునేటప్పడు అదే బ్రష్ ఉపయోగించకూడదు. పెదవులకు వాడే బ్రష్ బుగ్గలకు వాడకూడదు. అలాగే, మేకప్ పరికరాలను కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.