మార్చి నెలలో హిందువులకు ఎక్కువగా పవిత్రదినాలు, పండుగలు వస్తాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చిలో ఫాల్గుణ మాసం పూర్తయి, చైత్ర మాసం ప్రారంభమవుతుంది. చైత్ర మాసంలోని శుక్ల పక్షమి రోజున తెలుగు సంవత్సరాది ఉగాది వస్తుంది. ఈ నెలలో వచ్చే పవిత్రదినాల్లో హిందువులు ఉపవాసాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు. దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకొంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
చతుర్ది, ఏకాదశి వంటి ఉపవాస దినాలే కాకుండా ఇంకా చాలా పండుగలు మార్చి నెలలోనే ఉన్నాయి. మహాశివరాత్రి, రాజస్థాన్లో ప్రముఖంగా నిర్వహించే గన్గౌర్, శ్రీకృష్ణుడిని పూజించే ఫులైరా దూజ్, హోలీ, బసోద మార్చి నెలలో వచ్చే ప్రముఖ పండుగలు. అనంత విశ్వం వేడుకలను మార్చిలోనే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ ప్రారంభించాడని ప్రతీతి. మార్చి నెలలో వస్తున్న ప్రముఖ దినాలు, పండుగల గురించి తెలుసుకొందాం.. (ప్రతీకాత్మక చిత్రం)
మార్చి 1, మంగళవారం: మహాశివరాత్రి..
ఈ ఏడాది మార్చి 1న మహాశివరాత్రి జరుపుకొంటున్నాం. పరమశివుడిని ఈరోజు పూజిస్తే అనుగ్రహిస్తాడని, సమస్యలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో చతుర్దశి రోజున మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు ఉపవాసం ఉంటారు. శివుడు భూమి మీదకు వచ్చాడని, శివపార్వతులు పెళ్లి చేసుకొన్న రోజును మహాశివరాత్రిగా జరుపుకొంటారని చెబుతారు. హిందువులు భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి రోజు జాగారం, ఉపవాసాలు ఉండి శివుడిని ఆరాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మార్చి 2, బుధవారం: ఫాల్గుణ అమావాస్య
ఈ ఏడాది మార్చి నెల 2వ తేదీన ఫాల్గుణ అమావాస్య వచ్చింది. మహాశివరాత్రి రెండో రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు చేసి, దానాలు చేస్తే మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం. పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు, తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం ద్వారా పితృ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)