Leftover Rice: మన దేశంలో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువంది అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు.. అసలు చాలామందికి అన్నం లేనిదే రోజు గడవదు.. అన్నం కాకుండా ఏం తిన్నా ఆకలి తీరదు.. అయితే సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ను లెక్క చూసి మరీ అన్నం వండుతారు.. కానీ కొన్ని కారణాల వల్ల అన్న మిగిలిపోయే పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది.
అయితే అలా మిగిలిపోయిన ఆహారంతో ప్రత్యేకంగా ఏదైనా వంటకం తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే ఎన్నోడెజర్ట్లు కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ (Chef Sanjeev Kapoor) టీవల మిగిలిపోయిన అన్నంతో తయారుచేసిన ఒక ప్రసిద్ధ వంటకాన్ని పంచుకున్నారు.
ప్రముఖ గుజరాతీ వంటకం ముతియా. ఈ ముతియా తన ఇన్ స్టాగ్రామ్ ( Instagram)లో షేర్ చేశాడు. ఈ ముతియా అనేది గుజరాతీ సాంప్రదాయక వంట. శనగపిండి, మెంతి, ఉప్పు, పసుపు వంటి వాటితో తయారు చేసే ఒక స్నాక్. ఈ ముతియా స్నాక్ ను ఆవిరితో కానీ నూనె లో వేయించి కానీ తయారు చేసుకోవచ్చు. చెఫ్ సంజీవ్ కపూర్ మిగిలిపోయిన అన్నంతో ప్రత్యేకమైన వంటకం తయారు చేశారు. దీనికి ముతియా అని పేరు పెట్టారు.
ముందుగా రెండు కప్పుల మిగిలిపోయిన అన్నం తీసుకోండి. తర్వాత అరకప్పు శెనగపిండి, అల్లం-మిర్చి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఎర్ర కారం, జీలకర్ర పొడి, పంచదార , పెరుగు వేసి అన్నీ కలపాలి. చిటికెడు బేకింగ్ సోడా , నూనె వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని మరోసారి కలపండి. తర్వాత ఈ మిశ్రమంలో గోధుమ పిండి వేసి.. మెత్తగా పిండిగా చేసుకోవాలి.