మిరియాలలో ఉండే పైపరైన్ పదార్ధమే ఇందుకు కారణం అంటున్నారు. మిరియాల పొడితో పదార్థాల రుచి రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు. కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ పేగులలోని బాక్టీరియాను నాశనం చేసి కడుపు శుభ్రపరుస్తాయి.
అలాగే అధిక ఒత్తిడితో బాధపడుతున్నవారు వేడి వేడి పాలలో కొద్దిగా మిరియాల పొడిని వేసుకుని తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మిరియాలు కఫం, శ్లేష్మాలను కరిగిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. మిరియాలను బాగ వేయించి పొడి చేసి, ఆ పొడిని నూనెలో కలిపి మర్దన చేస్తే కీళ్లనొప్పులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి.