మూడు దశాబ్దాల క్రితం పండ్లను పండించే విధానం వేరుగా ఉండేది. అవి ఆరోగ్యానికి ఎంతో పోషకంగా ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న పండ్లలో పెద్ద మొత్తంలో పురుగుమందుల అవశేషాలు, వివిధ రకాల రసాయనాలు ఉంటున్నాయి. అవి శరీరానికి ప్రయోజనం కంటే అధికంగా హాని చేస్తున్నాయి.