ఆలివ్ ఆకుల్లోని ఔషధాలను పాలీఫెనాల్స్ అని పిలుస్తారు. ఇవి దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ళ నొప్పిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ హృదయ ధమనుల లోపల చేరుకున్న కొవ్వు నిల్వలను కరిగించి.. తద్వారా గుండెకు కూడా రక్షణ అందిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు.
శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో 55 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 124 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనకు స్విస్ శాస్త్రవేత్త మేరీ-నోయెల్ హోర్కాజాడా నాయకత్వం వహించారు. అధిక బరువు స్తఉన్న పురుషులు, మహిళలు ఇద్దరిపై వీరి పరిశోధన నిర్వహించారు. వీరిపై సగంమందికి పైగా అధిక బరువు కలిగి ఉన్నారు.. కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.