Bathing IN Cold Water: ప్రస్తుతం భారీ వర్షాలు మంచెత్తుతున్నాయి. వరుస తుఫాన్లతో విరామం లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెల్లవారున చల్లటి నీళ్లతో స్నానం చేయాలంటే చాలా మంది భయపడతారు. చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కానీ కొంతమంది వాతావరణం ఎంత చల్లగా ఉన్నా..? చల్లని నీటితో స్నానం చేస్తారు.
ఇంతకుముందు అంటే వేడి నీటి కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కట్టెల పొయ్యా లేదా గ్యాస్ పై వేడి నీళ్లు అంటే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వేడి నీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. హాట్ రాడ్ లు.. గ్లిజర్ లు అందుబాటులోకి వచ్చాయి. క్షణాల్లో వేడి వేడి నీళ్లు సిద్ధమై పోతాయి. దీంతో చలినీటితో స్నానానికి చాలామంది దూరం అవుతున్నారు.
కొందరు మాత్రం ఎంత చలి ఉన్నా.. చల్లటి నీటితో స్నానం చేయడానికే ఇష్టపడతారు. అలా చల్లటి నీటితో స్నానం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాల దృష్ట్యా చల్లటి నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొంత మంది మినహా.. అందరూ చల్లటి నీటితో స్నానం చేయడమే ప్రయోజనమని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ అనారోగ్యం
చల్లని నీటితో స్నానం చేసే వ్యక్తులు తక్కువ అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది పరిశోధకులు చల్లటి నీటితో స్నానం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్ముతున్నారు. చెక్ రిపబ్లిక్ నుంచి ఒక అధ్యయనం ప్రకారం.. యువ అథ్లెట్లు వారానికి మూడు సార్లు ఆరు వారాల పాటు చల్లటి నీటి స్నానం చేశారు.. అప్పుడు వారి రోగనిరోధక శక్తి మెరుగుపడింది. అయితే దీనిని నిర్ధారించడానికి సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు.
నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది
ముఖ్యంగా చల్లటి నీటితో స్నానం నాడీ వ్యవస్థకు ఉపయోగపడుతుంది అంటున్నారు. చల్లటి నీరు నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. దీనివల్ల నోరాడ్రినలిన్ హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ గుండె రేటును రక్త వేగాన్ని పెంచుతుంది. ఇది ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగు పరుస్తుందన్నది నిపుణుల అభిప్రాయం.
రక్త ప్రసరణలో మెరుగుదల
చల్లటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయిన్నది నిపుణుల మాట. చల్లటి నీటితో స్నానం చేస్తన్నప్పుడు మొదటగా చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. తర్వాత శరీరం స్వయంగా వేడెక్కవలసి ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే నాలుగు వారాల తర్వాత కండరాలకు రక్త ప్రసరణ మెరుగుపడిందని ఒక అధ్యయనంలో తేలింది.
మానసిక ఆరోగ్య ప్రయోజనాలు
శారీరక ప్రయోజనాలు కాకుండా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ‘ఫైట్ లేదా రన్ అవే’ ప్రతిస్పందన కారణంగా మానసిక చురుకుదనం పెరుగుతుందనే సిద్ధాంతం ఉంది. ముఖం, మెడపై చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల వృద్ధులలో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డిప్రెషన్ని ఎదుర్కొనేటప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తే మంచి రిలీఫ్ దొరకుతుంది.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ప్రమాదం ఉందా
చల్లని నీటిలో స్నానం ఆరోగ్యానికి ప్రయోజనకరమని రుజువు చేయడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్నా.. కొంతమందికి మాత్రం ఇది చాలా ప్రమాదకరం. గుండె జబ్బులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరం. ఒక్కోసారి ఇది గుండెపోటుకు కారణం కావచ్చు.