జపాన్, దక్షిణ కొరియా ప్రజలు దేన్నైనా ఉత్తినే పారేయకూడదనుకుంటారు. ముఖ్యంగా కొరియన్లు ప్రత్యేక స్కిన్ కేర్ విధానం పాటిస్తారు. ఇందుకోసం ఎలాంటి క్రీములూ, లోషన్లనూ వాళ్లు వాడరు.
2/ 5
బియ్యాన్ని నానబెట్టిన లేదా రైస్‌ని కడిగిన నీటిని వాళ్లు పారేయకుండా చక్కగా వాడేసుకుంటారు. బియ్యాన్ని నానబెట్టిన నీటిలో... చర్మాన్ని కాపాడే గుణాలుంటాయని పరిశోధనల్లో తేలింది.
3/ 5
రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే... మీకు మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధకులు. ఏం చెయ్యాలంటే... బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టాక... ఆ నీటిని వేరు చెయ్యాలి. ఆ తరవాత బియ్యాన్ని వేరే నీటితో కడుక్కోవచ్చు.
4/ 5
వేరు చేసిన నీటిని ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలలో వెయ్యాలి. ఆ ట్రేలలో నీరు గడ్డకట్టి... ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకోవాలి.
5/ 5
ఐస్ ట్రేలలో వేయగా మిగిలిన నీటిని... ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి... ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ముఖంపై, చేతులపై స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలుంటాయి.