కొరియన్ల అందమైన చర్మానికి కారణం వారు క్రమం తప్పకుండా కొన్ని స్కిన్‌కేర్ సీక్రెట్స్ (Skincare Secrets) ఫాలో కావడమే. బెస్ట్ సీక్రెట్ ఏంటంటే.. రైస్ వాటర్ (Rice Water) వాడటం. కొరియన్లు ఇలాంటి సహజసిద్ధమైన, సురక్షితమైన పదార్థాలు వాడటం వల్లే తమ చర్మాన్ని గొప్పగా సంరక్షించుకోగలుగుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
రైస్ వాటర్ (Rice Water) అందించే సౌందర్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే కొరియన్ కంపెనీలు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో రైస్ వాటర్‌ని విరివిగా వాడుతుంటాయి. భారత్‌లో ఈ తరహా ఫేస్ మాస్క్‌లకు అధిక డిమాండ్ కూడా ఉంది. మరి రైస్ వాటర్ చేకూర్చే అనేక ప్రయోజనాల్లో కొన్ని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
అద్భుతమైన స్కిన్ టోనర్ : బియ్యం నీళ్లు అద్భుతమైన టోనర్‌గా కూడా పనిచేస్తుంది. కొందరిలో చర్మరంధ్రాలు సాధారణ పరిమాణంలో కాకుండా పెద్దగా ఉంటాయి. వీటివల్ల మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం మరింత జిడ్డుగా అవుతుంది. ఇలా చర్మరంధ్రాల వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొనే వారికి కూడా రైస్ వాటర్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ నీరు రంధ్రాలను శుభ్రపరుస్తుంది. సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, ఫలితంగా పెద్దగా ఉండే రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది : రైస్ వాటర్ సహజమైన సన్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఈ సన్‌స్క్రీన్ హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. కాలిన చర్మాన్ని కూడా నయం చేస్తుంది. దీన్ని స్థిరంగా అప్లై చేయడం వల్ల సూర్యుని వల్ల తలెత్తిన అన్ని చర్మ సమస్యలు మటుమాయమవుతాయి. అలాగే డైలీ వాడటం వల్ల ఎన్నటికీ సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని జరగదు. (ప్రతీకాత్మక చిత్రం)
బియ్యం నీరు జుట్టు ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. అందుకే కండీషనర్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. రైస్ వాటర్ కురులను మృదువుగా చేసి చిక్కు లేని జుట్టును అందిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంతోపాటు జుట్టు దృఢంగా మారేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొరియన్ల మాదిరిగా ఎలాంటి మచ్చలులేని చర్మం, చక్కటి జుట్టును పొందాలనుకునే వారు రైస్ వాటర్ డైలీ వాడటం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)