KNOW THE REASON FOR STOMACH PROBLEMS AND AVOID THESE FOODS TO STAY AWAY FROM IT AK
Stomach Problems: కడుపులో సమస్యలకు అసలు కారణం ఇదే.. వీటిని గుర్తుంచుకోండి
Stomach Problems: మార్కెట్ నుంచి తీసుకొచ్చే కూరగాయలు, పండ్లు సరిగ్గా కడగకపోయినా కడుపులో సమస్యలు వస్తాయి. వాటిపై కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లడమే ఇందుకు కారణం.
మన బిజీ లైఫ్‌లో ఏదో ఒక ఆహారం తింటూ పనుల్లోకి వెళ్లిపోతుంటాం. ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ వంటి కూడా చాలాసార్లు మన డైట్లో భాగమవుతుంటాయి. సాధారణంగా జీర్ణప్రక్రియ కోసం మన శరీరం కొన్ని ఎంజైమ్‌లను విడుదల చేస్తుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే ఈ ఎంజైమ్‌లు విడుదల చేయకుండా చాలా రకమైన ఆహారాలు అడ్డుపడుతుంటాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కడుపు నొప్పి సహా కడుపులో వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
చాలామంది సీ ఫుడ్ లేదా సగం ఉడికిన ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు కొందరు సగం ఉడికిన మాంసం తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఆహారాల్లో ఎన్నో క్రిములు ఉంటాయి. పూర్తిగా ఉడికించకపోతే ఈ కడుపులో సమస్యలను తీసుకొస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మార్కెట్ నుంచి తీసుకొచ్చే కూరగాయలు, పండ్లు సరిగ్గా కడగకపోయినా కడుపులో సమస్యలు వస్తాయి. వాటిపై కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లడమే ఇందుకు కారణం.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఒకవేళ మీకు కడుపులో ఇబ్బందులు ఎదురైతే కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. చాలామంది టీ, కాఫీలు రోజుల్లో ఎక్కువసార్లు తింటారు. టీ, కాఫీ ఎక్కువగా తాగితే సమస్యలు వస్తాయి. అందులో ఉండే కెఫెన్ కడుపులో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇక ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కూడా అంత మంచిదికాదు. ఇది కడుపులో గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతాయి. అందుకే కడుపు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)