Gold Colour Ghee: నెయ్యిని చూస్తే చాలు నోరూరడం ఖాయం. ఆ వాసన తెగ నచ్చేస్తుంది చాలా మందికి. ఇక ఇళ్లలో పసుపు రంగు నెయ్యిని... బాణలిలో వేసి... అది ఎర్రగా మాడిపోతుంటే... అప్పటివరకూ దాన్ని వేపి... అప్పుడు మాత్రమే వంట మొదలుపెడతారు. నెయ్యి మాడే కొద్దీ సువాసన పెరుగుతూ ఉంటుంది. కానీ అలా మాడ్చిన నెయ్యిని వాడటం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. (symbolic image)
మనలో కొంత మంది నెయ్యి రోజూ వాడితే లావైపోతామని అంటుంటారు. కానీ కొద్ది మొత్తంలో నెయ్యి రోజూ వాడితే... నష్టాల కంటే లాభాలే ఎక్కువ. నెయ్యిలో... ఫ్యాట్తోపాటూ... విటమిన్ A, D, E, K కూడా ఉంటాయి. పైగా నెయ్యిలో వేడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇది జుట్టు, చర్మాన్ని... మృదువుగా ఉంచుతుంది. చక్కటి నిద్ర పట్టాలంటే నెయ్యి రెగ్యులర్గా వాడాలి. చలికాలంలో పెదవులు పగిలిపోతుంటే... నెయ్యి రాసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అన్నవే ఉండవు. (symbolic image)
జుట్టు పొడిబారిపోతున్నట్లు... జీవం లేనట్లు అయిపోతుంటే... ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని జుట్టుకి పట్టించి... బాగా మసాజ్ చేసి... పావు గంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు చక్కగా ఉంటుంది. గాలికి జుట్టు అలా ఎగురుతూ ఉంటే... చుట్టుపక్కల అందరూ ఆ జుట్టువైపే చూస్తుంటారు. చర్మ కణాలు, జుట్టు కుదుళ్లు చక్కగా ఉండేందుకు మెరుగయ్యేందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. (symbolic image)