హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలు ధరించే కుంకుమ జ్ఞానచక్రాన్ని చురుకుగా ఉంచుతుంది. రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ పెట్టుకోవడం వల్ల మానసిక బలం మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుందని నమ్ముతారు.
2/ 10
మహిళల్లో ఎడమ ముక్కు రంధ్రం గుండా వెళుతున్న కొన్ని రక్తనాళాలు కూడా గర్భాశయానికి అనుసంధానించబడి ఉంటాయి. అందుకే ఈ సమయంలో ముక్కు రంధ్రాలు గుచ్చుకుంటే ప్రసవ నొప్పులు తగ్గుతాయని.. ప్రసవ బాధ పెద్దగా ఉండదని పెద్దలు చెబుతారు.
3/ 10
మంగళసూత్రం బంగారంతో చేయబడుతుంది. కొన్నిసార్లు వెండిని కూడా ఉపయోగిస్తారు. ఈ రెండు లోహాలు స్త్రీలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
4/ 10
అదే సమయంలో.. మెడలో ధరించే ఇతర ఆభరణాలు కూడా మనకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ఆభరణాలు మెడలోని కొన్ని ప్రాంతాలపై ఒత్తిడి తెచ్చి.. గాయిటర్ మరియు మెడ కింద ఎముకలపై చెడు ప్రభావాన్ని తగ్గిస్తాయి.
5/ 10
చాలా మంది మహిళలు మట్టి గాజులను ఉపయోగిస్తారు. మట్టి గాజులు మహిళలకు కొన్ని వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గాజుల వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. పంటి నొప్పి, రక్తపోటు, ఊబకాయం వ్యాధుల్ని తగ్గిచండంలో మట్టిగాజులు సహాయపడతాయి.
6/ 10
వంకీలకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.ఈ ఆర్మ్బ్యాండ్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. భుజం మరియు చేయి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి వంకీలు.
7/ 10
నడుముకు వడ్డాణం పెట్టుకుంటే జీర్ణశక్తి పెరుగుతుందని... రుతుక్రమంలో ఎలాంటి సమస్యలు ఉండవని.. నడుము నొప్పి, నడుము నొప్పి కూడా తగ్గుతాయని నమ్ముతారు.
8/ 10
పాదాలకు ధరించే కాలు పట్టీలు ఎముకలను బలపరుస్తాయి. అలాగే వెండిలోని చల్లదనం వల్ల శరీరంలో వేడి తగ్గడంతోపాటు.. రుతుక్రమం వల్ల వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి.
9/ 10
పెళ్లయిన తర్వాత మహిళలు కాలి వేళ్లకు మెట్టెలు ధరిస్తారు. ఇది థైరాయిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్మోన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ మరియు శరీరం యొక్క దిగువ అవయవాల కండరాలను బలపరుస్తుంది.
10/ 10
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)