జైపూర్ ప్యాలస్‌లలో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. జైపూర్ అంటనే కోటలకు పెట్టింది పేరు. అందుకే సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోవాలనుకునే వారు ఈ కోటలనే ఎంచుకుంటున్నారు. జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రూ.15 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీంట్లో వసతి, వివాహ అలంకరణ, మెహందీ, కళాకారులు, సౌండ్ సిస్టం, ఫోటోగ్రాఫర్, ట్రావెలింగ్, ఫుడ్ అన్ని కలిపి ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇందులో వివాహానికి కావాల్సిన దుస్తులు, మేకప్ ఆర్టిస్ట ఛార్జీలు ఉండవు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ముఖ్యమైంది వసతి, ఫుడ్.
కాబట్టి వీటికి సూమారు ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకుంటే.. మీరు ఇక్కడ ఒక్కరాత్రి స్టే చేయాలంటే.. రూ.5 వేలు వసూలు చేస్తారు. 10 మంది అతిథులకు ఈ పింక్ సిటీలో 2 రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తే.. 40 గదులు అవసరం అనుకోంది. అప్పుడు 5000×2×40= 4,00,000. రెండు రోజులు ఆహారం, లంచ్ డిన్నర్ ఒక్కో ప్లేట్ ధర రూ.1000 అల్పాహారం కోసం మరో 1000 కలుపుదాం. చాలా హోటళ్లు ఫుడ్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. కానీ, సగటున రాత్రికి రూ.5000 వసూలు చేసే హోటల్లో ఒక వ్యక్తికి తిండికి అయ్యే ఖర్చు రూ.2500 అవుతుంది. కాబట్టి 2×3000×100 =6,00,000 . కాబట్టి మీరు ఫుడ్, ఆహారానికి రూ.9 లక్షలు అంచనా వేసుకోవచ్చు.
ఇక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ 2 రోజులపాటు ఫోటో, వీడియో కోసం సగటు ధర రూ.1.5 లక్షలు. డెకర్, సౌండ్, డీజే దాదాపు లక్షకుపైగా ఖర్చు అవుతుంది. మెహందీ ఆర్టిస్టులకు రూ.50×75 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేదానిపై ప్రయాణ ఛార్జీలు మారవచ్చు. కానీ, మీరు ఢిల్లీ నుంచి వస్తున్నారని అనుకుందాం. ఇది జైపూర్‌కు 4 గంటల ప్రయాణంలో ఉంది. మీరు 2 డీలక్స్ ఏసీ బస్సులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.20 –30 వేలు ఉంటుంది.
ఇది సగటు బడ్జెట్.. జైపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఖర్చు దాదాపు రూ.16 లక్షలు. మేకప్ అర్టిస్టులతోపాటు ఇతర అదనపు ఖర్చులను జోడించిన తర్వాత , 100 అతిథులు, సగటు బడ్జెట్ వసతిలో 2 రోజుల వివాహానికి అయ్యే ఖర్చు రూ.20 లక్షలకు మించదు. మీరు ఎంతమంది అతిథులు వస్తున్నారు..ఆ గణనను కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న వివాహా వేదిక ఆధారంగా ఫుడ్ ఛార్జీలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.
జైపూర్ ప్రపంచ ఆదరణ పొందిన సిటీ. ఇక్కడ రాజభవనాలు, హోటళ్లు, రుచికరమైన భోజనం ఉంటుంది. మీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. మీకు ఇది కొత్తసిటీ మొదటిసారి వెళ్లినా.. జైపూర్ వేదికలు, విక్రేతలు ఇతర నగరాల నుంచి వచ్చిన అతిథుల కోసం వారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి అనుభవజ్ఞులు ఉన్నారు.
లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్..
ఒక రాత్రికి రూ.40,000–రాంబాఘ్ ప్యాలస్, జైపూర్.
ఆ తర్వాతి స్థానంలో ఒబేరాయ్ రాజ్‌విలాస్ దాదాపు ఒక రాత్రి రూ,25,000.
లీలా జైపూర్– రూ.16,000.సుజన్ రాజ్‌మహల్ ప్యాలస్ ఒక్క రోజు రూ.18,000, దేవీరతన్ జైపూర్ రూ. 20,000, జేడబ్ల్యూ మ్యారియట్ కుకస్ రూ.16,000, ఫెయిర్మాంట్ జైపూర్ రూ.14,000, ఐటీసీ రాజ్‌పుటానా రూ.10,000, డబుల్ ట్రీ హిల్టన్ రూ.4000, లే మెరిడియన్ రూ.6,000, సమోద్ హవేలి– రూ.8,000
శివ విలాస్ రీసార్ట్–రూ.9,500, రాజస్థాలీ రీసార్ట్ అండ్ స్పా– రూ.6,000, ట్రైడెంట్ హోటల్ రీసార్ట్– రూ.4,000, నారయణ్ నివాస్ ప్యాలస్– రూ.5500, హాలిడే ఇన్న్ జైపూర్ రూ.3,500
శకున్ హోటల్స్, రీసార్ట్ రూ.2000
టిప్..
మే– జూలై వరకు వేసవి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. జూలైలో కురిసే వర్షంతో ఆ ప్రాంతం తేమగా ఉంటుంది. కాబట్టి, వేసవిలో వెడ్డింగ్ ప్లాన్ ఉంటే.. అక్కడ బయట ఎక్కువ ఉండకూడదు. అందుకే ఈ ప్రాంతంలో వివాహం చేసుకునే వారు వేసవిలో ప్లాన్ చేసుకోరు.ఇక్కడ అద్భుతమైన హాల్స్ అందుబాటులో ఉన్నాయి. వేసవిలో బయటవైపు కాకుండా ఈ హాల్స్‌లో వెడ్డింగ్ నిర్వహించుకోవచ్చు.